కడప రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో సంచలన ఘట్టం చోటు చేసుకుంది. తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో ఆమె బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత భేటీ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యాత్రలో ఉన్న షర్మిల.. జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. సోమవా రం ఉదయం ఆమె కడపకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకంటే ముందుగానే ఆమెతో సునీత భేటీ అయ్యారు.
ఇరువురూ అల్పాహార విందు కూడా చేశారు. మొత్తం గంటకుపైగానే ఇరువురు చర్చలు జరపడం రాజకీ యంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే వివేకా దారుణ హత్య తర్వాత వైఎస్ కుటుంబం రెండుగా చీలి పోయిన విషయం తెలిసిందే. నిజాలు దాస్తున్నారని.. నేరస్తులకు కొమ్ముకాస్తున్నారని.. ఇరువురు బహిరంగ విమర్శలు కూడా చేశారు. ఇక, సునీత ఏకంగా న్యాయ పోరాటానికి కూడా దిగారు. చెల్లికి అండగా.. షర్మిల కూడా గళం విప్పారు. ఈ క్రమంలో వీరి మధ్య మరింత బంధం ఏర్పడింది.
ఇది.. ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. వైఎస్ జగన్‌ను ఢీ అంటే ఢీ అంటున్న షర్మిల.. ఇప్పుడు సునీతను కూడా రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చి.. ఎలివేట్ చేయడం ద్వారా కీలకమైన కడప జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టే వ్యూహం ఉందనే అంచనాలు వస్తున్నాయి. రాజకీయాల్లో వచ్చే విషయంపై తాజాగా చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా తాను రాకున్నా.. తన తల్లి సౌభాగ్యమ్మను రంగంలోకి దింపడం ద్వారా.. ఇక్కడ వైసీపీ దూకుడుకు చెక్ పెట్టవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.
కడప ఎంపీ స్తానంపైనే ఇటు షర్మిల, అటు సునీత కూడా ఎక్కువగా చర్చించినట్టు సమాచారం. కాంగ్రెస్ పుంజుకుంటుందనే సంకేతాలు వస్తున్నాయని.. కాబట్టి.. పార్టీలోకి రా.. చెల్లి! అని ఆమె ఆహ్వానించినట్టు తెలిసింది. పార్టీలో చేరడంతోపాటు కడప ఎంపీ సీటును తీసుకుంటే గెలిపించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని షర్మిల చెప్పినట్టు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 29, 2024 4:19 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…