Political News

ఫ్రీ కరెంట్ భారమెంతో తెలుసా ?

మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ అమలులో ప్రభుత్వం స్పీడు పెంచుతోంది. అధికారంలోకి వచ్చిన నూరురోజుల్లోనే ఆరు హామీలను అమలులోకి తెస్తామని పార్టీ తరపున రేవంత్ రెడ్డి తదితరులు ప్రచారంచేశారు. వీళ్ళ ప్రచారమే లేకపోతే కేసీయార్ ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఏదైనా కాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చెప్పినట్లుగానే ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలు ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.

మిగిలిన నాలుగు హామీలు ఫ్రీ కరెంట్(గృహజ్యోతి), ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, రెండు లక్షల ఉద్యోగాలు, రుణమాఫి పై కసరత్తులు జరుగుతున్నాయి. ఇందులో ఫ్రీ కరెంటుపై కసరత్తు దాదాపు అయిపోవచ్చిందని సమాచారం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఉచిత విద్యుత్ వల్ల నెలకు ప్రభుత్వంపై రు. 320 కోట్ల భారం పడుతుందట. నెలకు 200 యూనిట్ల విద్యుత్ లోపు వాడుతున్న ఇంటి కనెక్షన్లు 90 లక్షలున్నట్లు విద్యుత్ శాఖ ప్రభుత్వానికి లెక్కలను అందించింది.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోపు ఆరు హామీలు అమల్లోకి వచ్చేట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పార్లమెంటు ఎన్నికల్లో మ్యాగ్జిమమ్ లాభపడాలంటే ఇచ్చిన హామీలను అమలు చేసిందనే నమ్మకాన్ని జనాల్లో నిలుపుకోవాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. హామీలిచ్చి గాలికి వదిలేసిందని జనాలు అనుకుంటే పెద్ద సమస్య అయిపోతోంది. అందుకనే హామీల అములుపై ప్రభుత్వం సీరియస్ గానే దృష్టిపెట్టింది. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుతున్న వినియోగదారుల వివరాలను సామాజికవర్గాల వారీగా విద్యుత్ శాఖ సేకరిస్తోంది.

ప్రభుత్వంలో వచ్చిన సందేహం ఏమిటంటే ఉచిత విద్యుత్ ను అన్నీ వర్గాల వారికి అమలుచేయాలా ? లేకపోతే వాళ్ళ స్ధితిగతుల ఆధారంగా అమలుచేయాలా ? అన్నది. ఇప్పటివరకు సేకరించిన వివరాల్లో ఒకే వ్యక్తిపేరుమీద రెండు మూడు కనెక్షన్లున్నాయట. ఇందులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఐటి రిటర్న్ సమర్పిస్తున్న వాళ్ళు కూడా ఉన్నట్లు తెలిసింది. అందుకనే ఇలాంటి వాళ్ళని ఏరేసే కార్యక్రమం చేపట్టబోతొంది ప్రభుత్వం. ఏదేమైనా తొందరలోనే గృహజ్యోతి పథకం అమల్లోకి రావటం ఖాయం.

This post was last modified on January 26, 2024 10:58 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago