ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ
డైలాగుతో సినీ అభిమానులను సంపాయించుకున్న క్యారెక్టర్ నటుడు పృధ్వీ రాజ్.. తాజాగా రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. గతంలో ఆయన వైసీపీ తరఫున ప్రచారం చేయ డం తెలిసిందే. అనంతరం.. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎస్వీబీసీ చానెల్ చైర్మన్‌గా కూడా వ్యవహరిం చారు. అయితే.. కొన్ని ఆరోపణలతో ఆయనను పక్కన పెట్టారు. అయితే.. తను చెప్పేది వినకుండానే తనను పక్కన పెట్టారని.. అప్పట్లోనే పృధ్వీ ఆరోపించారు.
ఇక, ఇప్పుడు తాజాగా పృధ్వీ ఓ మీడియాతో మాట్లాడుతూ.. బూతుల మినిస్టర్లు, బూతుల యూనివర్సిటీ కుప్పకూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో 175 కు 175 సీట్లు తెచ్చుకుంటామని చెబుతున్న వైసీపీకి చివరకు మిగిలేది 17 సీట్లేనని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశానని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగాప్రచారం చేస్తానని.. తనను ఎవరు ఆపుతారో చూస్తానని అన్నారు.
కాగా, యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ రెడ్ డైరీ ఉందని చెప్పారన్న పృధ్వీ.. తన దగ్గర పీఆర్ డైరీ
ఉందని అన్నారు. దుర్మార్గులు, మోసగాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, వీరిని ఉతికి ఆరేయాలని ప్రజలకు సూచించారు. వీరంతా రాజకీయాలకు అనుర్హలని అన్నారు. వారి చరిత్రనే తన పీఆర్ డైరీలో రాసుకున్నట్టు తెలిపారు. శ్యాంబాబు
లాంటి క్యారెక్టర్లన్నీ ఎన్నికల ప్రచారంలో బయటకు తీస్తానన్నారు.
తాను అవినీతి పరుడిని కాదని పృధ్వీ చెప్పారు. వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో తాను పార్టీకి పనిచేశానని.. 2014, 19లో పార్టీ కోసం ప్రచారం కూడా చేశానని అన్నారు. జగన్ మాట తప్పను మడమ తిప్పనని చెప్పి మడం తిప్పేశారు. రెడ్డి కాకపోవడమే నా దౌర్భాగ్యం. వైసీపీలో రెడ్లకే పెద్దపీట
అని పృధ్వీ ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on January 24, 2024 1:29 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి…
2024.. మరో రెండు రోజుల్లో చరిత్రలో కలిసిపోనుంది. అయితే.. ఈ సంవత్సరం కొందరిని మురిపిస్తే.. మరింత మందికి గుణపాఠం చెప్పింది.…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్నటి వరకు జేజేలు కొట్టి.. జ్యోతులు పట్టిన చేతులే.. నేడు కనుమరుగు…
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం మొత్తం ఎప్పుడూ రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి లేదు. ఆయన కుమారుడు, ఆయన కోడలు బ్రాహ్మణి…
2024 ముగిసిపోతోంది. ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు గొప్ప విజయాలతో పాటు కొన్ని నిరాశలకూ నిలిచింది. టీ20 వరల్డ్…