Political News

జన్ మత్ జోస్యం నిజమవుతుందా ?

తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలపై జన్ మత్ సర్వే సంస్ధ తన జోస్యాన్ని రిలిజ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లాగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కంటిన్యు అవుతుందని చెప్పింది. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటి స్ధానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు రెడీ అవుతున్నాయి. ప్రతిపార్టీ దేనికదే ప్రత్యేక వ్యూహాన్ని రెడీ చేసుకుంటున్నాయి. తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో తక్కువలో తక్కువ 15 సీట్లను గెలుచుకోవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నది.

అందుకు తగ్గట్లే అభ్యర్ధుల వడపోత కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నది. ప్రతి నియోజకవర్గంలోను గ్రౌండ్ లెవల్లో సర్వేలు చేయించుకుంటున్నది. బీఆర్ఎస్, బీజేపీలు ఇంకా సర్వేలపై పూర్తిస్ధాయి దృష్టిపెట్టలేదు. అయితే జన్ మత్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 7-9 స్ధానాలు దక్కుతాయని తేలిందట. అలాగే బీఆర్ఎస్ కు 4 లేదా 5 సీట్లు రావచ్చని అంచనా వేసింది. బీజేపీకి రెండు లేదా మూడు సీట్లు వచ్చే అవకాశముందని తేలిందట.

హైదరాబాద్ లోక్ సభ సీటును ఏ సర్వే సంస్ధయినా ఎంఐఎంకే వదిలేస్తోంది. అందుకనే మిగిలిన 16 సీట్లలోనే ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయనే పద్దతిలోనే సర్వేలు నిర్వహిస్తుంది. ఇదే జన్ మత్ సంస్ధ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముందుగానే తన జోస్యాన్ని బయటపెట్టింది. దాని ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పింది. కాంగ్రెస్ కు 65 సీట్లు వస్తాయని, బీఆర్ఎస్ 40 సీట్లలో గెలిచే అవకాశముందని జన్ మత్ ప్రీపోల్ చెప్పింది. ఆ సంస్ధ చెప్పినట్లే ఫలితాలు వచ్చిన విషయం అందరు చూసిందే.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అన్నీ పార్టీలు అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత ఓటర్ల ఆలోచన మారే అవకాశముంది. అంతేకాకుండా ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయముంది. కాబట్టి ఏ సర్వేసంస్ధ అయినా మళ్ళీ రెండుసార్లు సర్వేలు నిర్వహిస్తాయి. అప్పుడు రాబోయే రిజల్టు ఎలాగుంటుందనేది ఇంకాస్త కీలకంగా మారుతుంది. ఏదేమైనా జన్ మత్ రిడుదలచేసిన ఎగ్జిట్ ఫలితాల సర్వే ఆసక్తిగా మారింది.

This post was last modified on January 23, 2024 10:10 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

7 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

7 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

8 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

8 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

9 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

9 hours ago