సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ గట్టిగా తగులుకున్నట్లేనా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కారణం ఏమిటంటే కేసీయార్ పాలనలో ఒక మంత్రి నోటిమాటతోనే అర్వింద్ రు. 55 కోట్లు ఖర్చులు పెట్టిన విషయం బయటపడింది. 55 కోట్ల రూపాయలు ఖర్చలంటే మామూలు విషయంకాదు. అందుకనే అర్వింద్ మీద సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ తో లీగల్ ఒపీనియన్ కోసం చర్చలు చేస్తోంది.
ఇంతకీ ఏమి జరిగిందంటే కేసీయార్ పాలనలో ఫార్ముల ఈ రేస్ నిర్వహించాలని అప్పటిమంత్రి కేటీయార్ కలలు కన్నారు. అందుకనే అప్పటి హెఎండీఏ ఇన్చార్జిగా ఉన్న అర్వింద్ కుమార్ బాధ్యత అప్పగించారు. అర్వింద్ కూడా కేటీయార్ ఆదేశాల ప్రకారమే నడుచుకున్నారు. ఫార్ములా ఈ రేస్ కు అవసరమైన ఏర్పాట్లను అర్వింద్ దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఆ ఏర్పాట్లకు రు. 55 కోట్లు ఖర్చయ్యింది. రేస్ ప్రారంభానికి ముందే ఎన్నికలు జరగటం, ప్రభుత్వం మారటం అయిపోయింది.
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ముల ఈ రేస్ ను రద్దుచేసింది. వాతావరణ సహకరించని కారణంగా రేస్ ను ప్రభుత్వం రద్దుచేసింది. ఈ నేపధ్యంలోనే జరిగిన ఏర్పాట్లపై చర్చ మొదలైంది. దాంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. మొత్తం ఫైలును తెప్పించి చూస్తే అసలు రేస్ నిర్వహణకు పరిస్ధితులు అనుకూలించవని నిపుణులు చెప్పినా వినకుండా కేటీయార్ ఏర్పాట్లు చేయించినట్లు బయటపడింది. మరి ఖర్చులను ఎలా పెట్టారుని చూసింది ప్రభుత్వం. ఆ వివరాల కోసమే చీఫ్ సెక్రటరీ అర్వింద్ కు నోటీసులు ఇచ్చారు.
నోటీసులకు సమాధానంగా కేటీయార్ నోటిమాటనే ఆదేశంగా తీసుకుని రు. 55 కోట్లు ఖర్చులు పెట్టినట్లు సమాధానం ఇచ్చారని సమాచారం. ఎందుకంటే 55 కోట్ల రూపాయల ఖర్చులకు సంబంధించి ప్రభుత్వం అనుమతులు లేవు. అందుకనే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న నిధులనే అర్వింద్ ఖర్చులు చేసేశారు. ఈ విషయాలు బయటపడటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. అందుకనే ఎవరెవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే విషయాన్ని అడ్వకేట్ జనరల్ తో చర్చలు జరుపుతున్నారు. రేవంత్ లండన్ పర్యటన నుండి తిరిగి రాగానే యాక్షన్ మొదలవ్వచ్చని అనుకుంటున్నారు.
This post was last modified on January 20, 2024 12:31 pm
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…