ఏపీపై కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి సెంటిమెంటును వాడుకుని పార్టీని తిరిగి గాడిలో పెట్టాలని నిర్ణయించుకుం ది. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలని అనుకున్న రాజశేఖరరెడ్డి ఆలోచనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. వైఎస్ అభిమానులు, ఆయనను ఆరాధించేవారు.. కాంగ్రెస్కు అండగా నిలవాలన్న పిలుపుని ఇవ్వాలను నిర్ణయించుకుంది.
ఇదేసమయంలో వైఎస్ సానుభూతి ఇప్పటి వరకు వైసీపీకి అండగా ఉంది. దీనిని వైసీపీ నుంచి రాబట్టు కుని తమ వైపు తిప్పుకోవడం ద్వారా.. పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్ని స్తోంది. ఈ రెండు అంశాలనే అజెండాగా చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తాజాగా పార్టీ మాజీ చీఫ్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఇదే సూచనలను పార్టీకి వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనకు కూడా కీలక బాధ్యతలు అప్పగించనున్న నేపథ్యంలో ఆయన ఈ సూచనలు చేసినట్టు సమాచారం.
ఇక, ఏపీ కాంగ్రెస్ పగ్గాలను త్వరలోనే చేపట్టనున్న వైఎస్ తనయ వైఎస్ షర్మిల టీంలోనూ.. అప్పటి వైఎస్‌కు అనుకూలంగా ఉన్న వారికి.. ఆయన సెంటిమెంటును తిరిగి పార్టీకి అనుకూలంగామార్చే వారికి చోటు కల్పించనున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌లో ఉండి.. గతంలో పదవులు అనుభవించిన వారు ఎక్కడ ఉన్నా.. తిరిగి పార్టీలో చేర్చుకునేలా కూడా వ్యూహం రెడీ చేస్తున్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే.
కొన్ని రోజుల కిందట రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తమకు అన్నీ తెలుసునని.. కాంగ్రె స్లో ఉన్నప్పుడు పదవులు తీసుకుని, సంపాయించుకున్న వారి జాబితా తమ వద్ద ఉందని.. ఇప్పుడు వారుపార్టీని లైన్‌లో పెట్టాలని గద్దించారు. దీనిని బట్టి.. పాత కాపులు.. కాంగ్రెస్ బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. వీరికి ఇప్పుడు ప్రధాన అస్త్రాలుగా రాహుల్-వైఎస్ సెంటిమెంట్లే ఆయుధాలుగా మారనున్నాయని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచుతుందో చూడాలి.
This post was last modified on January 15, 2024 7:09 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…