టీడీపీ నాయకుడు, విజయవాడ పార్లమెంటు స్థానం నుంచివచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారంలో ఉన్న కేశినేని శివనాథ్ ఉరఫ్ చిన్నతన సొదరుడు, ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహామహులే టీడీపీని విడిచి పెట్టి వెళ్లిపోయారని..ఈయన ఎంత? అని వ్యాఖ్యానించా రు. తాజాగా నాని.. టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఎంపీపదవికి కూడా రాజీనామా సమర్పించారు.
ఈ నేపథ్యంలోబుధవారం నాని పార్టీపైనా.. నారా లోకేష్‌పైనా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నాని వ్యాఖ్యలకు చిన్ని కౌంటర్ ఇచ్చారు. తమ రెండు కుటుంబాల మధ్య 1999 నుంచి కలహాలు ఉన్నాయని.. వాటికి, చంద్రబాబుకు ఏం సంబంధం ఉంటుందన్నారు. నాని తనను గతంలో అనేక విధాల ఇబ్బందులు పెట్టారని.. అయినా.. తాను సర్దుకు పోయానని చిన్ని తెలిపారు. నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదన్నారు.
టీడీపీలో ఉంటూ.. ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెట్టిన రాజకీయ భిక్షతోనే నాని ఎంపీ అయ్యారని చిన్ని అన్నారు. ఈ విషయాన్ని మరిచిపోయి నోటికి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఎంతో మంది మహామహులు తెలుగుదేశం పార్టీని వీడినా.. పార్టీకి ఏమీ కాలేదన్నారు. పార్టీ ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో చూసిందన్నారు. వచ్చే వాళ్లు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేక పోయారని చిన్ని వ్యాఖ్యానించారు.
This post was last modified on January 11, 2024 1:07 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…