తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ను పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ లో కలిసి పరామర్శించారు. జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. దాదాపు గంటసేపు కేసీఆర్ నివాసంలో జగన్ గడిపారు. కేసీఆర్ ఆరోగ్య వివరాలను, ఆయన కోలుకుంటున్న వైనం గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు.
జగన్ వెంట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కూడా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత దాదాపు 45 నిమిషాలపాటు జగన్, కేసీఆర్ ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై వీరిద్దరూ చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక, కేసీఆర్ ను పరామర్శించిన వెంటనే జగన్ నేరుగా లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లారు. తన తల్లి విజయమ్మతో అరగంట సేపు మాట్లాడిన జగన్ ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి తాడేపల్లి బయలుదేరారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వచ్చారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిక నేపథ్యంలో కేసీఆర్ తో జగన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయమ్మతో కూడా షర్మిల కాంగ్రెస్ లో చేరిక విషయంపై జగన్ మాట్లాడి ఉంటారని ప్రచారం జరుగుతుంది.
This post was last modified on January 4, 2024 11:05 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…