Political News

వైసీపీ సిట్టింగ్ ల సెకండ్ లిస్ట్ ఇదే

ప్రస్తుతం ఏపీలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాడేపల్లి క్యాంపు నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందో…జగన్ నోటి నుంచి ఏం వినాల్సి వస్తుందో అని చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టెన్షన్ పడుతున్నారు. ఆల్రెడీ 11 మంది సిట్టింగ్ నేతల స్థానాలను మార్చిన జగన్ రెండో జాబితాపై గత వారం రోజులుగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ రెండో జాబితాను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది.

కొన్ని అసెంబ్లీ, కొన్ని లోక్ సభ స్థానాల ఇన్చార్జిలను మారుస్తూ తాజాగా వైసీపీ అధిష్టానం జాబితాను విడుదల చేసింది. 27 మందితో విడుదలైన జాబితాలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలు మారాయి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారమే ఈ నియామకాలు చేపట్టామని వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ 27 మందిలో కొందరు నేతల వారసులు ఉన్నారు. 11 మందిని మార్చిన నేపథ్యంలోనే వైసీపీలో అంతర్గత కలహాలు, అసంతృప్త నేతల వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 27 మందితో రెండో జాబితా విడుదలైన నేపథ్యంలో తమ స్థానాలు కోల్పోయిన నేతల రియాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, కొందరు నేతలకు టికెట్ ఇవ్వబోనని కరాఖండిగా జగన్ చెప్పేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత వారికి పార్టీలో తగిన ప్రాధాన్యతను కల్పిస్తానని హామీ ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో, పూతలపట్టు ఎమ్మెల్యే బాబు వంటి కొందరు ఎమ్మెల్యేలు తాము చేసిన తప్పేంటో చెప్పాలని, తమకు టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో వెల్లడించాలని వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం లేక ప్రత్యామ్నాయ మార్గాలు లేక గతిలేని స్థితిలో వైసీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

వైసీపీ విడుదల చేసిన 27 మంది ఇన్చార్జిల జాబితా

అనంతపురం పార్లమెంటు – శంకరనారాయణ

హిందూపురం పార్లమెంటు – శాంతమ్మ

అరకు పార్లమెంటు – భాగ్యలక్ష్మి

పెనుకొండ – ఉషశ్రీ చరణ్

ఎర్రగొండపాలెం – తాటిపర్తి రాజశేఖర్

ఎమ్మిగనూరు – మాచాని వెంకటేష్

గుంటూరు ఈస్ట్ – షేక్ నూర్ ఫాతిమా

మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి(కిట్టూ)

కల్యాణదుర్గం – తలారి రంగయ్య

అరకు అసెంబ్లీ – గొడ్డేటి మాధవి

విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాసరావు

పిఠాపురం – వంగా గీత

రాజాం – తాలే రాజేష్

ప్రత్తిపాడు – వరపుల సుబ్బారావు

తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి

రాజమండ్రి సిటీ – మార్గాని భరత్

రామచంద్రాపురం – పిల్లి సూర్యప్రకాశ్

పాడేరు – మత్స్యరాస విశ్వేశ్వరరాజు

విజయవాడ వెస్ట్ – షేక్ అసీఫ్

చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

కదిరి – మక్బుల్ అహ్మద్

అనకాపల్లి – మలకాపల్లి భరత్ కుమార్

జగ్గంపేట – తోట నరసింహం

పాయకరావు పేట – కంబాల జోగులు

రాజమండ్రి రూరల్ – వేణుగోపాల కృష్ణ

పి. గన్నవరం – వేణుగోపాల్

పోలవరం – తెల్లం రాజ్యలక్ష్మి

This post was last modified on January 3, 2024 12:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

48 minutes ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

57 minutes ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

1 hour ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

3 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

4 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

4 hours ago