వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకునే అంశంపై పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఢిల్లీ లో తాజాగా జరిగిన ఏపీసీసీ(ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ) సమావేశంలో షర్మిల కు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలపై చర్చ జరిగింది. షర్మిల పేరును ఏపీసీసీ చీఫ్ గా ప్రతిపాదించిన పీఏసీ మెంబర్, ఏపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాధరావు.. ఆమె ప్రాతినిధ్యంలో ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని బలంగా పేర్కొన్నట్టు తెలిసింది.
ఇక, మాజీ ఎంపీలు హర్షకుమార్, చింతా మోహన్ మినహా మిగిలిన వారంతా షర్మిల పేరు ప్రతిపాదన కు మద్దతు తెలిపినట్టు తెలిసింది. మాజీ ఎంపీ హర్షకుమార్ మాత్రం.. షర్మిల వచ్చినా.. ఏపీలో ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ లేదని పేర్కొన్నట్టు సమాచారం. ఇక, చింతా మోహన్.. తనకు ఏపీ బాధ్యతలు అప్పగించాలని, అధ్యక్షుడిని చేయాలని కోరినట్టు తెలిసింది. అయితే.. ఈ ఇద్దరి వాదనలను కూడా పార్టీ పక్కన పెట్టగా.. మెజారిటీ వాదన ప్రకారం షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయినట్టు తెలిసింది. ఇక, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పార్టీకి చేసిన సేవల నేపథ్యంలో షర్మిలకు బాధ్యతలను అప్పగించడంపై దాదాపు ఓకే చెప్పినట్టు సమాచారం.
ఇదిలావుంటే,.. ప్రస్తుతం షర్మిలకు ఒక పార్టీ ఉంది. ఒక పార్టీకి అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన పార్టీ వైఎస్సార్ తెలంగాణను కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆమెకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె పార్టీని విలీనం చేసుకునేందుకు కూడా కాంగ్రెస్ ఓకే చెప్పినట్టు తెలిసింది. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ.. ఈ విషయంపై త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని సీనియర్లు పేర్కొన్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారని ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ అన్నారు. “వైఎస్ఆర్ బిడ్డగా షర్మిల అంటే మాకు గౌరవం ఉంది. షర్మిలకు ఎటువంటి బాధ్యతలు ఇచ్చేదీ అధ్యక్షుడు ఖర్గేనే నిర్ణయం తీసుకుంటారు.” అని మాణిక్యం ఠాకూర్ తెలిపారు. దీంతో ఇప్పుడు షర్మిల ఎలా నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.
This post was last modified on December 27, 2023 9:36 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…