సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ తాజాగా సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కొత్తగా ఆయన సొంత కుంపటి పెట్టుకున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఇది పెట్టిన పార్టీ కాదని పుట్టిన పార్టీ అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పిన జేడీ.. కొన్నాళ్ల కిందటే.. వేరు కుంపటిపై లీకులు ఇచ్చారు. ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది.
ఇదిలావుంటే, జేడీ వారి కొత్త పార్టీ.. జై భారత్ నేషనల్ పార్టీ ప్రభావంఎలా ఉంటుంది? ఏయే వర్గాలను అది ఆకర్షిస్తుంది? వచ్చే ఎన్నికల్లో ఓటు షేర్ ఎలా ఉండనుంది? అనే విషయాలు ఆసక్తిగా ఉన్నాయి. ప్రస్తుతం జేడీ చేసిన ప్రకటనను బట్టి.. అన్నిస్థానాల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. కానీ, వాస్తవానికి ప్రధాన పార్టీలకే అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉంది. అందునా మార్పు కోసమే పార్టీ పెట్టానని.. అవినీతి, పక్షపాత రహితంగా పాలన అందించేందుకే పార్టీ పెట్టానని జేడీ చెప్పుకొచ్చారు.
సో.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. గతంలో పోటీ చేసి చతికిల పడిన లోక్‌సత్తా పార్టీనే కళ్లముందు కనిపిస్తోందని అంటున్నారు. ఇక, అభ్యర్థుల విషయానికి వస్తే.. జేడీకి చుక్కెదురే కానుంది. ఆయన కోరుతున్న లక్షణాలున్న వారు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం పెరిగిన ఖర్చులు.. ప్రజల ఆకాంక్షల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీకి.. 175 మంది అభ్యర్థులు దక్కే చాన్స్ లేదు. దొరికినా.. ఓ 10 నుంచి 20 మంది మాత్రమే కనిపిస్తున్నారు.
ఇక, మరో కీలక విషయం పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం. క్షేత్రస్థాయిలో తటస్థ ఓటర్లను కదలించే సత్తా ఉంటే.. అంతో ఇంతో డిపాజిట్లు దక్కించుకునే అవకాశం ఉంటుంది. కానీ, తటస్థ ఓటర్లను పట్టి.. వారిని మెప్పించేందుకు ఉన్న 60 రోజుల సమయం సరిపోతుందా? అనేది కీలక ప్రశ్న. మరో ముఖ్య విషయం.. నియోజకవర్గాల్లో అధ్యయనం. ఏ సామాజిక వర్గ ఆకాంక్షలు ఎలా ఉన్నాయి? అనేది ముఖ్యం. రాష్ట్ర అభివృద్ధి కీలకమే అయినప్పటికీ.. సామాజిక వర్గాల వారిగా ఓ టు బ్యాంకు చీలిపోయిన దరిమిలా.. వారిని సంతృప్తి పరిచేందుకు జేడీ ఏం చేస్తారనేది ప్రధానం.
ఇక, ఇప్పుడు అందరూ జపిస్తున్న యువ మంత్రం.. విషయంలో జేడీ ఎంత వరకు సక్సెస్ అవుతారు? యువత యాస్పిరేషన్ కేవలం ఉపాధి, ఉద్యోగాలేఅయినప్పటికీ.. వీటిని తాము కల్పిస్తామని చెబుతున్నా .. విశ్వసనీయతను కల్పించే దిశగా జేడీ అడుగులు పడతాయా? అనేది ప్రధాన ప్రశ్న. అదేవిధంగా గ్రామీణ ఓటు బ్యాంకును ఎంత వరకు ఆయన ప్రభావితం చేయగలుగుతారు? అనేది కూడా ముఖ్యంగా.. మొత్తంగా చూస్తే.. జేడీ వారి పార్టీపై ప్రస్తుతానికి ఎలాంటి అంచనాలు లేకపోవడం గమనార్హం. మున్ముందు ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప.. జేడీ ఆశించినట్టు పార్టీ పుంజుకునే పరిస్థితి ఉండదని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on December 23, 2023 2:53 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…