అవును.. దాదాపు పదేళ్లకు పైనే అయ్యింది జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెళ్లి. 2014లో ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీల మధ్య తొలిసారి పొత్తుల వేళలో పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన ఇంటికి వెళ్లారు. అప్పట్లో పొత్తు కేవలం మద్దతు రూపంలో ఉందే తప్పించి.. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు లేదన్నది మర్చిపోకూడదు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ.. బీజేపీ కూటమికి తాను అన్ కండీషనల్ గా మద్దతు ఇస్తానని పవన్ చెప్పటమే కాదు.. అందుకు తగ్గట్లే వ్యవహరించటం తెలిసిందే. ఏమీ ఆశించకుండా.. పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్న పవన్ తీరుకు చంద్రబాబు అప్పట్లో ముచ్చటపడ్డారని చెబుతారు.
అందుకు తగ్గట్లే.. ఆయన ఇంటికి వెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు స్వయంగా తన ఇంటికి రావటంపై పవన్ మరింత సానుకూలంగా స్పందించేందుకు దోహదపడినట్లుగా చెబుతారు. కట్ చేస్తే.. ఆ తర్వాత పవన్ నివాసానికి చంద్రబాబు వెళ్లింది లేదు. మిత్రులు కాస్తా ప్రత్యర్థులుగా మారటం.. తర్వాతి కాలంలో మళ్లీ స్నేహితులు కావటం లాంటి పరిణామాలు గడిచిన పదేళ్లలో చోటు చేసుకున్నాయి. అన్నింటికి మించి.. స్కిల్ స్కాం ఎపిసోడ్ లో జైలుకు వెళ్లిన చంద్రబాబును పరామర్శించేందుకు సొంత పార్టీ నేతలు సైతం కిందా మీదా పడుతున్న వేళ.. అవేమీ పట్టించుకోకుండా పవన్ స్పందించిన వైనం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
మిత్రుడు అంటే పవన్ కల్యాణ్.. మిత్రపక్షం అంటే జనసేన అన్నట్లుగా ఉండటాన్ని తెలుగుదేశం వర్గీయులు సైతం గుర్తించారు. అప్పటివరకు జనసేనతో పొత్తు విషయంలో పెద్దగా ఆసక్తి చూపని టీడీపీలోని ఒక వర్గం సైతం మనసు మార్చుకున్నట్లు చెబుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ మద్దతు ఎంత అవసరమన్నది చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ లో గుర్తించినట్లుగా తెలుగు తమ్ముళ్లు తమ ప్రైవేటు సంభాషణల్లో మాట్లాడుకోవటం కనిపిస్తుంది.
ఇలా తమకు అండగా నిలిచిన పవన్ కల్యాణ్ తో పొత్తు మాత్రమే కాదు.. దీర్ఘకాలం పాటు రిలేషన్ ఉండాలన్న అభిప్రాయం తమ్ముళ్లలో అంతకంతకూ పెరుగుతోంది. మిత్రధర్మాన్ని పాటించే విషయంలో చంద్రబాబు కంటే పవన్ కల్యాణ్ ఎక్కువగా రియాక్టు అవుతుంటారన్న మాట వినిపిస్తోంది. ముందు వెనుకా చూసుకోకుండా దూసుకెళ్లటం.. మిత్రుడి కోసం కాపు కాసేలా వ్యవహరించే పవన్ తీరుపై తెలుగుదేశంలోనూ పాజిటివ్ కోణం అంతకంతకూ పెరుగుతోంది.
ఇవన్నీ ఇలా ఉంటే.. జనసైనికుల వెర్షన్ వేరుగా ఉందని చెబుతారు. ఎంతసేపటికి పవన్ పూసుకోవటమే తప్పించి.. తెలుగుదేశం నుంచి పెద్దగా రియాక్షన్ లేదని..తమ అధినేత అదే పనిగా చంద్రబాబును కలుస్తుంటారు కానీ.. ఆయన మాత్రం తమ అధినేతను ఎందుకు కలవరన్న శంక ఒకటి ఉంది. ఇలాంటి కొన్నిఅంశాలు తరచూ చర్చలకు వస్తున్నాయి. ఇలాంటి ఫీడ్ బ్యాక్ ను తన సన్నిహిత వర్గాల నుంచి అందుకున్న చంద్రబాబు.. అలాంటి ప్రచారానికి చెక్ చెప్పేందుకు వీలుగా పవన్ ఇంటికి వెళ్లారని చెబుతున్నారు. మొత్తానికి పదేళ్లకు కానీ పవన్ ఇల్లు చంద్రబాబుకు గుర్తుకు రాలేదన్న మాట చూస్తే.. జనసైనికుల్లోని అసంత్రప్తి కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. దీన్ని తొలగించే బాధ్యత చంద్రబాబుదే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.
This post was last modified on December 18, 2023 10:22 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…