Political News

తూర్పు వైసీపీలో టికెట్ మంట‌లు

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఒక్కొక్క‌టిగా టికెట్ల‌ను ఖ‌రారు చేస్తున్న వైసీపీలో నాయ‌కులు కూడా అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. త‌మ‌కు టికెట్ ద‌క్కుతుందో ద‌క్క‌దోన‌నే ఆవేద‌న చాలా మంది నాయ‌కుల్లో గూడుక‌ట్టుకుంది. ఇక‌, కొన్ని కొన్ని జిల్లాల్లో వైసీపీ టికెట్ల వ్య‌వ‌హారాన్ని కూడా తేల్చేస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా ఉమ్మడి తూర్పు గోదావ‌రి జిల్లాకు సంబంధించి మూడు టికెట్ల‌పై వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. తూర్పు గోదావ‌రి జిల్లా వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

తూర్పు గోదావరి జిల్లాలోని కీల‌క‌మైన‌ ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యేలకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు లేవ‌ని తేల్చి చెప్పేశారు. వీరికి వచ్చే ఎన్నికల్లో సీటు తిరస్కరిస్తున్నట్లు అధిష్టానం తేల్చి చెప్పేసింది. అమరావతికి పిలిపించుకుని పార్టీ పరిశీలకుడు మిథున్ రెడ్డి ఈ విష‌యాన్ని తేల్చి చెప్ప‌డంతో వారంతా కంగుతిన్నారు. వీరి స్థానాల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తుందీ చెప్పి మరీ సహకరించాలని కోరారు. దీంతో స‌ద‌రు స్థానాల నాయ‌కులు వెనుదిరిగారు.

అయితే.. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత మాత్రం ఎమ్మెల్యేలు ఫైర‌య్యారు. సీఎం జగన్‌ను నేరుగా కలిసి తేల్చుకుంటామని వ్యాఖ్యానించారు. అధిష్ఠానం సీటును నిరాకరించడంతో జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు సమావేశం నిర్వహించారు. త‌న దారి తాను చూసుకుంటాన‌ని చంటిబాబు త‌న అనుచ‌రుల‌తో వ్యాఖ్యానించారు. మరోపక్క జగ్గంపేట సీటు తనకే ఇస్తున్నారని మాజీ మంత్రి తోట నరసింహం ప్రకటించుకున్నారు.

ఇక‌, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు కూడా ఆవేద‌న‌లోఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి తీరుతాన‌ని.. గ‌తంలోనే తాను హామీ ఇచ్చాన‌ని, కానీ, ఏ స‌ర్వేలో ఏముందో కానీ.. త‌న సీటును తీసేయడం అన్యాయ‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక‌, ప్ర‌తిప్తాడు ఎమ్మెల్యే ప‌ర్వ‌త పూర్ణ చంద్ర‌ప్ర‌సాద్ కూడా ఆవేద‌న‌లో ఉన్నారు. అయితే, అధిష్టానం చెప్పిన‌ట్టే న‌డుచుకుంటాన‌ని.. ఆయ‌న వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. కాగా.. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వ‌రుస‌గా ప్ర‌జ‌లు మార్పు కోవ‌డం గ‌మ‌నార్హం. బ‌హుశ ఈ నేప‌థ్యంలోనే వైసీపీ మ‌రోసారి మార్పులు చేసిన‌ట్టుగా భావిస్తున్నారు.

This post was last modified on December 16, 2023 11:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

57 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago