Political News

నెక్స్ట్ టార్గెట్ ధరణేనా?

బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు అర్ధమవుతోంది. ముందు విద్యుత్ శాఖ వ్యవహారాలపై సమీక్ష మొదలుపెట్టగానే అందులోను అవకతవకలు బయటపడ్డాయి. సమీక్షలో ఉన్నతాధికారులు బయటపెట్టిన వివరాల ప్రకారం విద్యుత్ శాఖ రు. 85 వేల కోట్ల అప్పుల్లో ఉందని తేలింది. అలాగే జెన్ కో, ట్రాన్స్ కో లో జరిగిన అనేక అక్రమాలు కూడా మెల్లిగా బయటపడుతున్నాయి. విద్యుత్ శాఖ సమీక్ష తాలూకు వేడి మెల్లిగా మొదలైంది.

ఈ వేడి ఇలాగ మొదలవ్వగానే వెంటనే రెండో టార్గెట్ కూడా మొదలైపోయినట్లుంది. ఇంతకీ రెండో టార్గెట్ ఏమిటంటే ధరణి పోర్టల్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ద్వారా పెద్దఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు చాలాకాలంగా ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి. మంత్రులు, ఎంఎల్ఏలుగా పనిచేసిన వాళ్ళతో పాటు కొందరు సీనియర్ నేతలు కూడా పోర్టల్ ను అడ్డుపెట్టుకుని వందలు, వేల ఎకరాల భూములను కబ్జా చేసినట్లు రేవంత్ రెడ్డితో సహా చాలామంది నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

వీటన్నింటికీ పరాకాష్టగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరిగిన దగ్గర నుండి ఫలితాలు వచ్చిన డిసెంబర్ 3వ తేదీ మధ్యలో పెద్దఎత్తున అడ్డదారిలో వందలాది ఎకరాలు అక్రమంగా అధికార పార్టీ నేతల పేరుతో బదిలీ అయినట్లు బయటపడింది. అందుకనే దానికి బాధ్యులైన కొందరు ఉద్యోగులపై కేసులు నమోదుచేసి సస్పెండ్ చేసింది ప్రభుత్వం. గడచిన పదేళ్ళలో ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు భూ అక్రమాలకు  పాల్పడినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

అందుకనే నాలుగు రోజుల అసెంబ్లీ సమావేశాలు పూర్తవ్వగానే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ధరణి పోర్టల్ లో జరిగిన అక్రమాలపై సమీక్ష పెట్టుకున్నట్లు సమాచారం. ముందుగా రెవిన్యు మంత్రితో సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి ప్రాధమిక సమాచారం రెడీ చేయమని చెప్పారట. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కీలకమైన కారణాల్లో ధరణి పోర్టల్లో అవకతవకలు కూడా ప్రధానమైనదనే చెప్పాలి. మరి ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి సమీక్షలో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి.

This post was last modified on December 10, 2023 11:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైజయంతి’ మాట కోసం ‘అర్జున్’ యుద్ధం

https://www.youtube.com/watch?v=hFNCZ_oVOZ4 ఏడాదిన్నరగా కళ్యాణ్ రామ్ కు గ్యాప్ వచ్చేసింది. డెవిల్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నందమూరి హీరో…

45 minutes ago

తమిళ దర్శకులకు సునీల్ లక్కు

ఒకపక్క కామెడీ వేషాలు ఇంకోవైపు విలన్ పాత్రలు వేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా నడిపిస్తున్న సునీల్ కు కోలీవుడ్ లో…

50 minutes ago

జనసేన ఖాతాలో తొలి మునిసిపాలిటీ

అంతా అనుకున్నట్టే అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండానే జనసేన ఓ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా…

1 hour ago

ధోనిపై తమిళ హీరో సంచలన వ్యాఖ్యలు

తమిళ జనాలకు మహేంద్రసింగ్ ధోని అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆ జట్టుకు…

2 hours ago

పెరుసు – ఇంత విచిత్రమైన ఐడియా ఎలా వచ్చిందో

తమిళంలో ఆ మధ్య పెరుసు అనే సినిమా రిలీజయ్యింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. తెలుగు డబ్బింగ్ తో పాటు…

2 hours ago

రాముడి పాట….అభిమానులు హ్యాపీనా

గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…

3 hours ago