బీఆర్ఎస్ ఓటమితో సుకేష్ చంద్రశేఖర్ రెచ్చిపోయారు. ఢిల్లీలోని తీహార్ జైలు నుండి ఒక లేఖ విడుదలచేశారు. అందులో కేటీయార్, కవితలను ఉద్దేశించి అనేక వ్యాఖ్యలు చేశారు. దురాశ, అవినీతి వల్లే తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని సుకేష్ తేల్చేశాడు. తోందరలోనే అహంకారం, అత్యశ అంతమవుతుందని తాను ముందుగానే చెప్పానని సుకేష్ గుర్తుచేశాడు. చేసిన అవినీతికి తండ్రి, కూతుర్లు చట్టాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. చాలా కాలంగా కేటీయార్, కవితకు సుకేష్ మధ్య లేఖల యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
అనేక ఆరోపణలు ఎదుర్కొంటు మనీల్యాండరింగ్ వ్యవహారంలో ఇరుక్కుని ప్రస్తుతం సుకేష్ జైలులో ఉన్నాడు. సడెన్ గా కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో టార్గెట్ చేయటంతో సంచలనాలు మొదలయ్యాయి. కవితకు మద్దతుగా కేటీయార్ రంగంలోకి దిగటంతో ఇద్దరిపైనా సుకేష్ అవినీతి ఆరోపణలతో రెచ్చిపోయాడు. లిక్కర్ స్కామ్ లో కవితకు తాను రు. 16 కోట్లు ఇచ్చానని, పార్టీ ఆపీసులోని ఒక కారులో ఉంచిన డబ్బును కవిత తీసుకున్నట్లుగా సుకేష్ చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలమైంది.
అయితే ఆ ఆరోపణలను కవిత కొట్టిపడేశారు. కానీ సుకుష్ అందుకు అంగీకరించకుండా తన ఆరోపణలకు మద్దతుగా తనకు కవితకు మధ్య డబ్బు విషయంలో జరిగిన కొన్ని వాట్సప్ స్క్రీన్ షాట్లను మీడియాకు రిలీజ్ చేశాడు. డబ్బు విషయంతో పాటు ఇతరత్రా చాటింగులను కూడా రిలీజ్ చేశాడు. దాంతో వాళ్ళిద్దరికి మంచి సన్నిహితం ఉన్న విషయం బయటపడింది. అప్పటినుండి సుకేష్ ఆరోపణలకు కవిత స్పందించటం మానుకున్నారు.
తర్వాత ఏమైందో ఏమో సుకేష్ కూడా మౌనంగా ఉండిపోయారు. అలాంటిది ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే సడెన్ గా సుకేష్ మళ్ళీ పిక్చర్లోకి వచ్చారు. కేసీయార్ ఓటమి, బీఆర్ఎస్ ఓటమిపై పెద్ద లేఖను విడుదల చేయటం ఇపుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సుకేష్ విడుదల చేసిన లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అసలే ఓటమి బాధలో ఉన్న కేసీయార్ కుటుంబాన్ని సుకేష్ టార్గెట్ చేసుకోవటం, సెటైర్లు వేయటంతో బహుశా వాళ్ళు మండిపోతుండచ్చు. మరీ లేఖకైనా సమాధానం ఇస్తారా లేదా అన్నది చూడాలి.
This post was last modified on December 9, 2023 11:09 am
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…