తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే.. ఓటమి బాధ నుంచి తేరుకుంటోంది. గెలిచిన నాయకులను పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.
తాజాగా బేటీకి అందరూ రావాలని.. పార్టీ నుంచి ఆహ్వానం అందింది. అయితే.. గెలిచిన వారిలో తెల్లంను తప్పిస్తే.. మిగిలిన వారిలో మరో ముగ్గరు డుమ్మా కొట్టారు. మామా అల్లుళ్లు.. మల్లారెడ్డి(మేడ్చల్), రాజశేఖ ర్‌రెడ్డి(మల్కాజిగిరి), సుదీర్‌రెడ్డి(ఎల్బీనగర్)లు సమావేశానికి హాజరు కాలేదు. కీలకమైన ఈ సమావేశానికి వారు గైర్హాజరు కావడంతో పార్టీలో లుకలుకలు వినిపిస్తున్నాయి.
ఎవరు అధికారంలో ఉంటే వారికి జైకొట్టే లక్షణం ఉన్న మల్లారెడ్డి గురించి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలావుంటే. తాజా భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, భవిష్యత్ ప్రణాళికపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చిస్తున్నారు. అయితే.. కీలక మైన మీటింగ్ కు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేల రాకపోవడంతో వీరు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. నేడు రేపు కూడా ఈ సెగ ఉంటుందని బీఆర్ ఎస్ సైతం అంచనా వేస్తుండడం గమనార్హం.
This post was last modified on December 4, 2023 4:24 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…