Political News

బీఆర్ ఎస్ ఓట‌మి.. నెటిజ‌న్ల లెక్క‌లు ఇవే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి తీరుతామ‌ని.. ఆగం కావ‌ద్ద‌ని ప‌దే ప‌దే చెప్పిన బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు.. ప్ర‌జ‌లు భారీ షాకే ఇచ్చారు. క‌నీసం ఏదో ఒక ర‌కంగా.. అయినా అధికారం నిల‌బెట్టుకునేందు కు అవ‌కాశం లేని రీతిలో తీర్పు చెప్పారు. దీంతో తెలంగాణ‌ను తెచ్చిన వీరుడికి.. ఓట‌మిని ఒప్పుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే.. ఈ ఓట‌మికి కార‌ణాలేంటి? అనేది ఇంకా.. ఆ పార్టీ వెల్ల‌డించ‌క‌పో యినా.. నెటిజ‌న్లు మాత్రం లెక్క‌లు తీసేశారు.

బీఆర్ ఎస్ ఓట‌మికి.. నెటిజ‌న్లు ఏకంగా.. చాలా త‌ప్పులే చూపించారు. వీటిలో కీల‌మైన‌విఆస‌క్తిగా ఉన్నాయి . ఈ త‌ప్పులు చేయ‌డం వ‌ల్లే బీఆర్ఎస్ ఓడిపోయింద‌ని నెటిజ‌న్లు లెక్క‌లు గ‌ట్టారు. వీటిలో సీఎం దూకు డు నుంచి పాల‌న ప‌డ‌క వ‌రకు, అభ్య‌ర్థుల ఎంపిక నుంచి నిరుద్యోగుల ఆవేద‌న వ‌ర‌కు, తెలంగాణ ఆకాంక్షల నుంచి ప్ర‌భుత్వం ఆంక్ష‌ల వ‌ర‌కు .. అనేక అంశాల‌ను వారు ప్ర‌స్తావించారు. వీటిలో ప్ర‌ధాన‌మైన‌వి ఇవీ.. మ‌రి బీఆర్ ఎస్ అధినేత వీటిని ఒప్పుకొంటారో లేదో చూడాలి.

ఇవీ నెటిజ‌న్లు తేల్చిన ఓట‌మి లెక్క‌లు!

  • సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత
  • తాము ఎవరిని నిలబెట్టినా జనం గెలిపిస్తారనే అతివిశ్వాసం
  • సొంత మీడియాలో ఆల్ ఈజ్ వెల్ అంటూ ప్రచారం
  • నిజాలు మాట్లాడేవారి పట్ల నిర్ధయగా వ్యవహరించటం
  • తెలంగాణ అంటే ఆ నలుగురే(క‌విత‌-కేటీఆర్‌-హ‌రీష్‌-కేసీఆర్‌) కనిపించటం
  • ప్ర‌తి ఎన్నిక‌లోనూ సెంటిమెంటునే న‌మ్ముకోవ‌డం
  • కేసీఆర్ ప్రజల్లో విశ్వాసం క్రమంగా కోల్పోవటం
  • కొద్దిరోజులు మోడీని పొగడటం, మళ్లీ తిట్టడం..
  • అవినీతిపరులైన పార్టీ నాయకులను వెనకేసుకుని రావటం
  • బీజేపీ విషయంలో చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని జనం నమ్మటం
  • యువతకి ఉద్యోగాల కల్పనలో విఫలం
  • ఇంటర్ లీకేజీ, ఏపీపీఎస్‌సీ లీకేజి వంటి వాటితో యువతలో వ్యతిరేకత
  • ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత
  • కాళేశ్వరం ప్రాజెక్టు లీకేజీలతో ప్రభుత్వ ప్రతిష్ఠకు డ్యామేజీ
  • ఉద్యమపార్టీ అయి ఉండి ఉద్యమకారులను దూరం చేసుకోవటం
  • ఆర్టీసీలో యూనియన్లే లేకుండా చేసి సమ్మెను క్రూరంగా అణిచివేయటం
  • సింగరేణి కార్మికుల్లోనూ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత
  • అసెంబ్లీలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్నే తెరాసలో చేర్చేసుకోవటం
  • తెలంగాణ గడ్డ మీద తాము తప్ప ఇతరులు ఉండకూడదనే అసహజ కోరిక
  • లిక్కర్ స్కాంలో కవిత వ్య‌వ‌హారం
  • చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేటీఆర్ దురుసు వ్యాఖ్యలు
  • దళితబంధు, బీసీ బంధు వందలో ఒకరికే అందటంతో మిగిలిన 99మందిలోనూ వ్యతిరేకత
  • అండగా ఉన్న ఆంధ్రా సెటిలర్లు, కమ్మ సామాజికవ‌ర్గాన్ని దూరం చేసుకోవటం
  • BRS-BJP ఒకటే అని న‌మ్మిన జ‌నాలు

This post was last modified on December 3, 2023 8:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

60 mins ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

4 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

5 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

5 hours ago