Political News

తెలంగాణ డీజీపీపై ఈసీ వేటు.. స‌స్పెండ్ చేసిన ఎన్నిక‌ల సంఘం

తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్‌.. డీజీపీ .. అంజ‌నీకుమార్‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారని ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఆయ‌న‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ ఉత్త‌ర్వులు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. దీంతో తెలంగాణ పోలీసులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు.

ఏంటీ కార‌ణం?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్న నేప‌థ్యంలోనే డీజీపీ అంజ‌నీ కుమార్‌.. నేరుగా కాంగ్రెస్ పీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి క‌లుసుకున్నారు. ఆయ‌న శుభాకాంక్ష‌లు చెప్పారు. పుష్ప‌గుచ్ఛం అందించారు. నిజానికి అప్ప‌టికి ఇంకా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోనే ఉంది. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల మేర‌కు.. ఫ‌లితాలు పూర్తిగా వ‌చ్చాక‌.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వాటిని డిక్లేర్ చేసిన త‌ర్వాత‌.. ఎవ‌రు గెలిచారు? ఎవ‌రు ఓడారు అన్న‌ది ఎన్నికల సంఘం అధికారికంగా ప్ర‌క‌టించాక మాత్ర‌మే అధికారులు రాజ‌కీయ నేత‌ల‌ను క‌లుసుకోవాల్సి ఉంది.

అయితే.. ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇంకా వెలువ‌డుతున్న స‌మ‌యంలోనే అంజ‌నీ కుమార్‌.. మ‌రో డీజీపీ(శాంతి భ‌ద్ర‌త‌లు)తో క‌లిసి.. రేవంత్ నివాసానికి వెళ్లి శుభాకాంక్ష‌లు తెలిపారు. అప్ప‌టికి.. కాంగ్రెస్ లీడ్లో ఉంది. దీంతో కాంగ్రెస్ గెలిచేస్తుంద‌న్న సంకేతాలు కూడా వ‌చ్చాయి.ఈక్ర‌మంలో అంద‌రిక‌న్నా ముందుగానే.. డీజీపీ వెళ్లి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇది అన్ని మాధ్య‌మాల్లోనూ వైర‌ల్ అయింది. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న ఎన్నిక‌ల సంఘం.. డీజీపీపై వేటు వేస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 3, 2023 5:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అప్పు చేయడం తప్పు కాదా?

ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…

20 minutes ago

లోకేష్‌తో సినిమాపై తేల్చేసిన స్టార్ హీరో

కూలీ సినిమా విడుద‌ల‌కు ముందు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ భ‌విష్య‌త్ ప్రాజెక్టుల గురించి ఎంత చ‌ర్చ జ‌రిగిందో.. ఎన్ని ఊహాగానాలు…

2 hours ago

ఏజెంట్ రెండేళ్లు ఓటీటీలోకి రానిది ఇందుకా?

అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుంద‌ని.. అత‌డిని పెద్ద స్టార్‌ను చేస్తుంద‌ని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అత‌నొక్క‌డే,…

5 hours ago

పవర్ స్టార్… ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయ!

ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…

7 hours ago

మ‌నిషి వైసీపీలో – మ‌న‌సు కూట‌మిలో..!

రాష్ట్రంలోని ఒక్కొక్క‌ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…

8 hours ago

జైల్లో ఉన్న హీరోకు థియేటర్ విడుదల

స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…

8 hours ago