ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాలేరుపై ఎన్నికల ముందు నుంచి ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం.. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయడమే. ఇక, బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు.
ఇక, మరోవైపు.. కమ్యూనిస్టు అగ్రనాయకుడు, తమ్మినేని వీరభద్రం కూడా ఈ దఫా పోటీకి దిగారు. ఈయన ఒంటరి పోరులో కుస్తీ పట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇటు రాజకీయంగా, అటు బెట్టింగుల పరంగా కూడా..పాలేరు మీడియాలో నిలిచింది. ఇక, ఎగ్జిట్ పోల్స్ అనంతరం.. ఇక్కడ నుంచి పొంగులేటి విజయం తథ్యమని బెట్టింగ్ రాయుళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. కాంగ్రెస్‌లో ఉన్న కొందరు నాయకుల అనుచరులే బెట్టింగులు కట్టారు.
పొంగులేటికి టికెట్ ఇవ్వడం ఇష్టంలేని కొందరు నాయకులు ఆయనకు సహకరించని విషయం ప్రస్తావనార్హం. ఇదిలావుంటే.. రాష్ట్రంలో భారీ ఎత్తున డబ్బులు పంచిన నియోజకవర్గాల్లో పాలేరు కీలకంగా మారింది. పోలింగ్‌కు ముందు.. నామినేషన్ వెలువడగానే కూడా.. ఖమ్మం నుంచి వందల కోట్ల సొమ్ము తరలిపోతుం డగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ.. ఇక్కడ కోట్ల మూటలు పరుగులు పెట్టాయనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా పొంగులేటికి మద్దతుగా బెట్టింగులు పెట్టిన వారంతా ఖుషీగా ఉన్నారని అంటున్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఏకపక్షంగా పొంగులేటికి మద్దతుగా మారాయి. దీనిలో ఏమీ తేడాలేకున్నా.. ప్రత్యర్థులకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 50 కోట్లకుపైగా పందాలు కట్టారని.. ఒక టాక్ నడుస్తుండడం గమనార్హం.
This post was last modified on December 2, 2023 5:02 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…