Political News

వీళ్లు అయోధ్య‌-వాళ్లు తిరుమ‌ల‌.. ఎవ‌రిని ఏమ‌నాలి?

రాజ‌కీయాల్లో ఏమైనా చేయొచ్చు.. ఏమైనా మాట్లాడొచ్చు.. అనే వారికి ఇవి మ‌చ్చుతున‌కలు. బీజేపీ నేత‌లు ప్రారంభించిన‌.. గుడియాత్ర‌ల వ్య‌వ‌హారం.. ఏపీ వర‌కు పాకిపోయింది. మ‌మ్మ‌ల్ని గెలిపించ‌డం.. అయోధ్య రాముడి ద‌ర్శ‌నానికి అయ్యే ఖ‌ర్చు భ‌రించి.. ఉచితంగా రాముడి ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని. కేంద్ర మంత్రి అమిత్‌షా.. మ‌ధ్య ప్ర‌దేశ్, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్నిక‌ల్లో ప్రచారం చేశారు. హిందువుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఇక‌, అమిత్ షానే కాదు.. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా.. ఈ విష‌యాన్ని జోరుగా ప్ర‌చారం చేశారు. త‌న సొంత రాష్ట్రంలో అయోధ్య రాముడు జ‌న‌వ‌రిలో కొలుదీర‌నున్నాడ‌ని.. ఆయ‌న ద‌ర్శ‌నంకోసం.. మిమ్మ‌ల్ని ఫ్రీగా తీసుకువెళ్లి.. ద‌ర్శ‌నం చేయిస్తామ‌ని ఆయ‌న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. అయితే.. బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఇస్తేనేన‌ని ఆయ‌న ష‌ర‌తు విధించారు. ఇలా.. అయోధ్య రాముడి ద‌ర్శ‌నాల‌ను రాజ‌కీయం చేసిన క్రెడిట్ బీజేపీకే ద‌క్కింది.

ఇక‌, ఇప్పుడు ఏపీలోనూ ఇదే తంతు మొద‌లైంది. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తిలు స్థానిక నాయ‌కులు, ప్ర‌జ‌ల‌కు.. తిరుమ‌ల యాత్ర‌ను ఫ్రీగా చూపిస్తున్నారు. అది కూడా బ్రేక్ ద‌ర్శ‌నాలు కావ‌డం గ‌మ‌నార్హం. రాయ‌దుర్గం నుంచి వారానికి రెండు బ‌స్సులు పెట్టి.. ఇక్క‌డి త‌మ అనుకూల వ‌ర్గానికి వారు శ్రీవారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు. రాను పోను, ఖ‌ర్చుల‌తోపాటు తిరుమ‌ల‌లో గెస్ట్ హౌస్‌ల ఖ‌ర్చును కూడా వారే భ‌రిస్తున్నారు.

అయితే.. బ్రేక్ ద‌ర్శ‌న టికెట్‌ను మాత్రం యాత్రికులే సెంటిమెంటుగా చెల్లిస్తున్నారు. ఇక‌, తిరుమ‌ల నుంచి క‌ళ్యాణ ల‌డ్డూలు విరివిగా తెప్పించి.. నియోజ‌క‌వ‌ర్గంలో భార‌తి.. ఇంటింటికీ పంచుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌ను గెలిపిస్తే.. కాశీ యాత్ర‌కు కూడా తీసుకువెళ్తామ‌ని హామీ ఇస్తున్నార‌ట‌. మొత్తానికి వాళ్లు అయోధ్య రాముడిని చూపిస్తామంటే.. వీరు తిరుమ‌ల శ్రీవారిని చూపిస్తున్నారు. ఎవ‌రిని ఏమ‌నాలి! అంతా రాజ‌కీయం.

This post was last modified on November 28, 2023 3:05 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

5 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

7 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

7 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

9 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

10 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

11 hours ago