నిజంగానే కొత్త విషయం. ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు మాటల్ని ఇప్పటికే పలుమార్లు విన్నాం. కాస్త కష్టంగానే ఆయన తెలుగు మాట్లాడతారు. కానీ.. ఆయన తెలుగును బాగానే అర్థం చేసుకుంటారా? అంటే.. అవుననే మాట ఆయన నోటి నుంచే రావటం గమనార్హం. యూపీలోని ఝాన్సీలో కొత్తగా నిర్మించిన రాణీ లక్ష్మీబాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా అక్కడి విద్యార్థులతో మాట్లాడారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో మాట్లాడిన క్రమంలో ఏపీలోని క్రిష్ణా జిల్లాకు చెందిన టోనీ మనోజ్ కుమార్ తోనూ ప్రధాని మాట్లాడారు. తన పేరును చెప్పిన విద్యార్థిని.. మోడీ రెండుసార్లు అడిగారు. నిజానికి మోడీనే కాదు.. ఎవరున్నా.. ఆ విద్యార్థి పేరును రెండుమూడుసార్లు అడగాల్సిందే. ఎందుకంటే.. అంత ఆసక్తికరంగా ఉందా పేరు. ఇంతకీ ఆ విద్యార్థి పేరేమిటటే.. టోనీ మనోజ్ కుమార్. అతగాడు తన పేరు చెప్పిన వెంటనే మోడీ స్పందిస్తూ టోనీనా? మనోజ్ కుమారా? అని అడగ్గా.. తన పూర్తి పేరు టోనీ మనోజ్ కుమార్ గా చెప్పారు.
అలా అయితే మీరు టోనీగారు అన్న మాట అంటూ మోడీ సరదాగా పలికటంతో అక్కడ నవ్వులు విరబూశాయి. శనివారం తెలుగు భాషా దినోత్సవం కావటంతో తాను తెలుగులో మాట్లాడతానని సదరు విద్యార్థి కోరగా.. తప్పకుండా మాట్లాడాలని.. తనకు బాగుంటుందని ప్రధాని చెప్పారు. దీంతో.. సదరు విద్యార్థి తెలుగులో మాట్లాడారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టోనీ మాట్లాడిన తెలుగు మాటలు తనకు అర్థమైనట్లుగా మోడీ చెప్పటం. అంతేకాదు.. టోనీ మనోజ్ చెప్పిన మాటలకు సరైన రీతిలో స్పందించటం చూసినప్పుడు తెలుగు మాటల్ని మోడీ అర్థం చేసుకుంటారన్న కొత్త విషయం బయటకు వచ్చిందని చెప్పాలి.
ఇంతకూ మనోజ్ ఏం మాట్లాడారంటే.. ‘‘మీ సంక్షేమ.. వ్యవసాయ కార్యక్రమాలు దేశానికి శుభకరంగా.. ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అందుకు ధన్యవాదాలు’’ అని చెప్పగా.. అందుకు మోడీ స్పందిస్తూ.. తాను ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని కానని.. మీ సహచరుడినే.. అంటూ చెప్పిన వ్యాఖ్యలు చూస్తే.. ప్రధానికి తెలుగు బాగానే అర్థమవుతుందని చెప్పక తప్పదు. మోడీలోని ఇప్పటికి బయటకు రాని టాలెంట్లు ఇంకెన్ని ఉన్నాయో?
This post was last modified on August 30, 2020 5:14 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…