తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రులు ఎవరు అనే వివాదం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకే పరిమితమైంది. ఈ పార్టీలో లెక్కకు మించిన నాయకులు.. తామంటే తామేనని ముఖ్యమంత్రి అభ్య ర్థులుగా అనధికార ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇది రాజకీయంగా కూడా కాంగ్రెస్‌ను ఇబ్బంది పెడుతోంది. “కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ, ప్రజలు మాత్రం లేరు” అంటూ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ఇక, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రుల గోల.. మరో జాతీయ పార్టీ బీజేపీలోనూ రాజుకుంది. బండి సంజయ్ నుంచి ఒకరిద్దరు బీసీ నాయకులు.. తామే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే.. ఇదంతా కూడా.. తెరచాటునే జరుగుతోంది. అయితే.. ఇప్పుడు ఇలాంటి వారిలో సీఎం విషయంపై బహిరం గంగా బ్లాస్ట్ అయ్యారు.. మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్. బీజేపీ అధికారంలోకి వస్తే.. తానే ముఖ్యమంత్రినని ఆయన ఓమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. ఈ విషయాన్ని ఆయన మరింత బలంగా చెప్పేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరును కూడా వినియోగించారు. ఇటీవల ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభ జరిగిన విషయం తెలిసిం దే. ఈ సభలో ఈటల కూడా పాల్గొన్నారు. సభ అనంతరం.. ఆయనతో మోడీ భేటీ అయ్యారని.. ఈ క్రమంలో 30 మంది బీసీ నాయకుల మధ్యలో రేపు కాబోయే ముఖ్యమంత్రివి నువ్వే అంటూ.. మోడీ వ్యాఖ్యానించారని ఈటల చెప్పుకొచ్చారు. ఇంత మంది మధ్యలో ప్రధాని అంతటి వాడు మాటిస్తే.. తాను ముఖ్యమంత్రిని కాక మరెవరు అవుతారని ఆయన ప్రశ్నించడం గమనార్హం.
ఇక, బండి సంజయ్ విషయానికి వస్తే.. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఏం చేస్తున్నా ఆయన అనుచరులు మాత్రం సీఎం సీఎం అంటూ.. హోరెత్తిస్తున్నారు. ఆయన కాబోయే సీఎం అంటూ ఫ్లెక్సీలు కూడా కడుతున్నారు. ఇక, ఈ రేంజ్‌లో కాకపోయినా.. మరో ఇద్దరు బీసీ నాయకులు కూడా సీఎం పీఠంపై కన్నేశారు. మొత్తానికి సీఎంల గోల కాంగ్రెస్ నుంచి బీజేపీకి పాకిందనే వాదన వినిపిస్తోంది. మరి ఇది బీజేపీకి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అనేది తెలియాలంటే డిసెంబరు 3వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on November 10, 2023 7:16 pm
https://www.youtube.com/watch?v=hFNCZ_oVOZ4 ఏడాదిన్నరగా కళ్యాణ్ రామ్ కు గ్యాప్ వచ్చేసింది. డెవిల్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నందమూరి హీరో…
ఒకపక్క కామెడీ వేషాలు ఇంకోవైపు విలన్ పాత్రలు వేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా నడిపిస్తున్న సునీల్ కు కోలీవుడ్ లో…
అంతా అనుకున్నట్టే అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండానే జనసేన ఓ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా…
తమిళ జనాలకు మహేంద్రసింగ్ ధోని అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆ జట్టుకు…
తమిళంలో ఆ మధ్య పెరుసు అనే సినిమా రిలీజయ్యింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. తెలుగు డబ్బింగ్ తో పాటు…
గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…