మరి కొద్దిరోజుల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ ప్రచార రథం వ్యాన్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహనంపై ఉన్న రెయిలింగ్ పై కేటీఆర్ పడిపోయారు.
కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా రెయిలింగ్ పై పడడంతో అది వ్యాన్ ముందుకు పడిపోయింది. అయితే, కేటీఆర్ వ్యాన్ పైనే పడిపోగా…ఎంపీ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి వాహనంపై నుంచి పూర్తిగా కిందకు పడిపోయారు. ఈ ఘటనలో కేటీఆర్ కు స్వల్ప గాయాలయ్యాయి. సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డిలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కేటీఆర్ పొత్తికడుపులో రెయిలింగ్ సేఫ్టీ రాడ్ గట్టిగా ఒత్తుకున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక ఆసుపత్రిలో వీరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది.
అయితే, తన ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలు, ప్రజలు ఆందోళన చెందవద్దని కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం కొడంగల్ లో రోడ్ షో పాల్గొనేందుకు కేటీఆర్ బయలుదేరతారని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on November 9, 2023 4:25 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…