ఏపీ సీఎం జగన్ దాదాపు గత పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని, ఆయనపై కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని టీడీపీ సహా ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇక, గతంలో ఇదే అంశంపై కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని హరిరామజోగయ్య వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరిపింది. 2024 ఎన్నికల లోపు ఈ కేసులపై తీర్పునివ్వాలని వేసిన పిటిషన్ ను పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం)గా స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. దీంతో, ఈ విషయంపై కోర్టులో సుదీర్ఘ వాదలు జరిగాయి. ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత దానిని పిల్ గా మార్చేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే సీఎం జగన్, సీబీఐ, సీబీఐ కోర్టులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇక, ఇదే విషయంపై రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు కూడా స్పందించిన సంగతి తెలిసిందే. జగన్ తోపాటు సీబీఐకి కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ పక్క సుప్రీం కోర్టు, మరో పక్క తెలంగాణ హైకోర్టు వరుస నోటీసులివ్వడంతో జగన్ కు డబుల్ షాక్ తగిలినట్లయింది.
This post was last modified on November 8, 2023 10:36 pm
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…