తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుందన్న చర్చ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ విషయాన్ని అనధికారిక సమావేశాల్లో అధికార బీఆర్ఎస్ నేతలు సైతం ఒప్పుకోవటం కనిపిస్తోంది. పదేళ్ల కేసీఆర్ పాలనపై తెలియని అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ కు ఈసారి అధికారాన్ని అందించాలన్న అభిలాష పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. ఇలాంటి వేళలో.. కేసీఆర్ అండ్ కో చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆగమాగం అవుతుందని.. ముఖ్యమంత్రి పదవి కోసం అరడజను మంది ముందుకు వస్తారని.. డెవలప్ మెంట్ ఆగిపోతుందని.. సీఎం కుర్చీలాటలోనే సమయం గడిచిపోతుందంటూ తెలంగాణ ప్రజల మనసుల మీద ప్రభావం చూపేలా వ్యాఖ్యలు వస్తున్నాయి. దీనికి తోడు.. కాంగ్రెస్ అన్నంతనే కుమ్ములాటలు.. పదవుల కోసం కోట్లాటలు మామూలే అన్న చర్చ జరగటం తెలిసిందే. ఇలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
పదవుల కోసం.. పేరు కోసం తపించే కొందరు కీలక నేతలు అనూహ్య ప్రకటనలు చేస్తున్నారు. తాము ముఖ్యమంత్రి రేసులో లేమన్న విషయాన్ని తమ మాటలతో స్పష్టం చేస్తున్నారు. మొన్నటికి మొన్న జగ్గారెడ్డి ఇదే విషయాన్ని చెప్పేస్తూ.. భవిష్యత్తులో తాను ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రిని అవుతానని వ్యాఖ్యానిస్తే.. తాజాగా ఆ లిస్టులోకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వచ్చేశారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే తొందర ఇప్పుడే లేదన్న ఆయన.. “నల్గొండ ప్రజల ఆశీర్వాదంతో ఏదో ఒక రోజు తెలంగాణకు సీఎం అవుతా.ఇప్పటికిప్పుడు తొందర లేదు” అని వ్యాఖ్యానించటం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం లొల్లి లేదని.. తాము పోటీ పడటం లేదని చెప్పటంతో పాటు.. పార్టీ ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్లకే ఆ పదవి లభిస్తుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నారు. జగ్గారెడ్డి.. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తుంటే.. అధికార పార్టీ చేసే వ్యాఖ్యలతో ప్రజలు కన్ఫ్యూజన్ కాకూడదన్న విషయంతో పాటు.. సీఎం పదవి ఈసారికైతే తనకు దక్కదన్న విషయంపై అవగాహనకు వచ్చేశారని చెబుతున్నారు. కేసీఆర్ అండ్ కో చేసే ప్రచారానికి చెక్ పెట్టే క్రమంలో కోమటిరెడ్డి ఈ క్లారిటీ ఇచ్చి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on %s = human-readable time difference 12:49 pm
నిత్యం విరామం లేని పనులతో.. కలుసుకునే అతిథులతో బిజీబిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా టీ కాచారు. స్వయంగా…
తెలంగాణలోనూ తెలుగు దేశం పార్టీని పరుగులు పెట్టించాలని భావిస్తున్న ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదిశగా…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి నాలుగు మాసాలు అయింది. అయితే… వచ్చిన తొలినాళ్లలో చేయాలనుకున్న పనులను కొంత లేటుగా ప్రారంభించేవారు.…
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే…
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఈమధ్య మరింత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’లో నటిస్తున్నాడు.…
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం ధరలకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బీరు…