హైదరాబాద్ లో జరిగిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు కే లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితర నేతలు హాజరయ్యారు. నా కుటుంబ సభ్యులారా అంటూ తన ప్రసంగాన్ని ప్రధాని మోడీ తెలుగులో ప్రారంభించారు.
సభలో సమ్మక్క సారలమ్మ… యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని మోడీ తలుచుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే పదాల్ని తెలుగులో పలికిన మోడీ. నా కుటుంబ సభ్యులారా.. అంటూ పలుమార్లు పలికి అందరినీ అలరించారు. పుణ్యభూమి తెలంగాణకు ప్రమాణాలు అని మోడీ వ్యాఖ్యానించారు. మోడీ తెలుగులో మాట్లాడగానే సభా ప్రాంగణం అంతా అరుపులు, కేరింతలు, కేకలతో దద్దరిల్లిపోయింది.
ఈ సందర్భంగా బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రధాని మోడీ ప్రకటించారు. అత్యధికంగా బీసీ ఎంపీలు బిజెపి నుంచే ఉన్నారని ప్రధాని గుర్తు చేశారు కేంద్ర క్యాబినెట్ లో కూడా ఓబీసీలకు ప్రాధాన్యతనిచ్చామని వెల్లడించారు. ఈ వేదికపై పవన్ కళ్యాణ్ తనతో ఉన్నారని, మైదానంలో జన సునామీ ఉందని పవన్ ను ఉద్దేశించి మోడీ ప్రశంసలు గుప్పించారు. తెలంగాణ బిజెపిపై ప్రజలు విశ్వాసం ఉంచి ఈ సభకు హాజరయ్యారని అన్నారు. బిఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందని, ఈ అవినీతి సర్కారును ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని మోడీ జోస్యం చెప్పారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో నే టిఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్పారని మోడీ గుర్తు చేశారు. ఇక, బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధాలున్నాయని, ఆ కేసు దర్యాప్తు చేస్తుంటే ఇక్కడ ప్రజలు సీబీఐ, ఈడీలను తిడుతున్నారని ప్రధాని అన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారి నుంచి తిరిగి రాబడతామని, అవినీతిని అంతం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే టిఎస్పిఎస్సి పేపర్ లీక్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.
This post was last modified on November 8, 2023 6:16 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…