ఔను.. ఇప్పుడు ఈ మాటే వైసీపీలో జోరుగా వినిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న విజ్ఞాన్ సంస్థల సీఈవో.. లావు శ్రీకృష్ణ దేవరాయులుకు, పార్టీకి మధ్య గ్యాప్ జోరుగా పెరిగిపోయిందనే వాదన వినిపిస్తోంది. రైతులు రాజధాని కోసం ఆందోళన చేస్తున్న సమయంలో ఆయన నేరుగా వారి శిబిరాలకు వెళ్లి పరామర్శించిన నాటి నుంచి సీఎం జగన్ ఆయనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.
ఇక, పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తాలన్నా.. పార్లమెంటరీ పక్ష నాయకుడిగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డి లావుకు ఛాన్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో సుమారు 12 ప్రశ్నలపై లావు తయారు చేసుకున్న నివేదికకు మిథున్‌రెడ్డి.. గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదం తెలపలేదు. దీంతో లావు.. పార్లమెంటుకు కూడా సరిగా హాజరుకాలేక పోయారు. ఇక, స్థానికంగా కూడా వైసీపీ నాయకులు ఆయనకు దూరంగా ఉంటున్నారు. వెరసి లావు పరిస్థితి సన్నగిల్లిందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట టికెట్‌ను వేరే వారికి కేటాయించేందుకు వైసీపీలో అంతర్గత చర్చ సాగుతున్నట్టు కొన్నాళ్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతకు ఈ టికెట్ కేటాయించే అవకాశం ఉందని కొన్నాళ్లు, కాదు.. పారిశ్రామిక వేత్తకు కేటాయిస్తారని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చేందుకు ఎదురు చూస్తున్న బలమైన నాయకుడి వారసుడికి కేటాయించేందుకు అధిష్టానం రెడీ అయితే.. చర్చ సాగుతోంది.
వెరసి.. వైసీపీలో దూకుడుగా ఉన్న.. లావు శ్రీకృష్ణదేవరాయలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమనే వాదన వినిపిస్తోంది. ఇదిలావుంటే.. గుంటూరుకు చెందిన కొందరు నాయకులు కూడా లావుపై ఫిర్యాదులు చేయడం.. ఆయనతో కలిసి పనిచేయలేమని చెప్పడం..(చెప్పారా? చెప్పించారా? అనేది సందేహం) వంటివి కూడా చర్చగానే ఉన్నాయి. మొత్తానికి 2019 ఎన్నికల సమయంలో లావుకు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 18, 2023 11:02 am
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…