“తెలంగాణ ఇచ్చింది మేమే. ఇక్కడి ప్రజల త్యాగాలను చూసి సోనియమ్మ మనసు కరిగిపోయింది. ఎన్నో అడ్డంకులను కూడా అధిగమించి.. రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆమెకు కృతజ్ఞతగా.. పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉంది. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి. బంగారు తెలంగాణ కల సాకారం చేసే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుంది”- ఇదీ.. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాట.
మరి ఈ మాటలకు తెలంగాణ ప్రజలు కరిగిపోయారా? సానుభూతి వర్షాల్లో తడిసిముద్దవుతున్నారా? సోనియాను చూపించి సెంటిమెంటును రాజేస్తున్న కాంగ్రెస్ నేతల ప్రయత్నాలకు వారు ఫిదా అవుతు న్నారా? అంటే.. లేదనే చెప్పాలి. ఎందుకంటే.. తెలంగాణ ఎన్నికల సమరానికి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక సర్వేలు వచ్చాయి. స్థానిక సర్వేలు సహా.. జాతీయస్థాయిలో సంస్థలు కూడా బలమైన ప్రజానీకాన్ని కలిసి తమ ఫలితాలు వెల్లడించాయి.
ఆయా సర్వేల్లో ఎక్కడా కూడా.. ఏ ఒక్క సర్వేలోనూ.. కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దక్కించుకోలేక పోయింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కనీసం 60 స్థానాల్లో విజయం దక్కించుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈ ఫిగర్ కాంగ్రెస్‌కు అందడం లేదు. ఏ సర్వే చూసినా 40-50 మధ్య స్థానాలకే కాంగ్రెస్‌ను పరిమితం చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ ఫ్యూచర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరి ఈ పరిస్థితి రావడానికి తప్పెవరిది ? గడిచిన పదేళ్లుగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు సానుభూతి పునాదులు పదిలం చేసుకోకపోవడంలో ఎవరి నేరం ఉంది? అనేది తరచి చూస్తే.. అందరూ అందరే అనే వాదన వినిపిస్తోంది. ఎన్నికలు వస్తే తప్ప.. కనిపించని ప్రజలు. వారి సమస్యలు ప్రధానంగా కాంగ్రెస్‌ను దెబ్బేస్తున్నాయి. ఇక, పీసీసీ పీఠం విషయంలోనే నాయకులు జుట్టు జుట్టు పట్టుకుని.. పార్టీని బలహీన పరిచిన ఉదంతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.
అదే సమయంలో ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకముందే.. ముఖ్యమంత్రి సీటుపై చర్చలు లేవనెత్తడం.. ఒకరికి నలుగురు కలిసి ఈ పీఠంపై వ్యాఖ్యలు చేయడం.. కూడా ప్రజల్లో కాంగ్రెస్ ఇమేజ్‌ను మరింత తగ్గించాయి. ఇక, సీట్ల పంపకాలు.. అంతర్గత కుమ్ములాటలతో నేతల అసంతృప్తి.. పార్టీ వ్యూహాన్ని సానుభూతిని ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా.. అడ్డుకట్ట వేసుకున్నది కూడా సొంత నేతలే. వెరసి.. కాంగ్రెస్ రేపు ఎన్నికల్లో నష్టపోయినా.. అది స్వయంకృతమే తప్ప.. ఎవరూ పనిగట్టుకుని.. ఆ పార్టీని పుట్టిముంచనక్కరలేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 6, 2023 8:44 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…