మొదటి నుంచి కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రయాణం సాగిస్తున్న సీనియర్ నాయకుడు ఆయన. 1989 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. చెన్నారెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర తొలి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో మరోసారి వైఎస్సార్ ప్రభుత్వంలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ వరుసగా ఓటములు ఆయన రాజకీయ జీవితానికి బ్రేకులేశాయి. కానీ పట్టు వదలకుండా ఆయన ముందుకు సాగుతూనే ఉన్నారు. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ కు సానుకూల పవనాలు వీస్తుండటం, పైగా ఆ సీనియర్ నేత కూడా గెలుపుపై విశ్వాసంతో మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. కానీ ఇంతలోనే షాక్. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోసం ఆయన సీటు త్యాగం చేయక తప్పడం లేదు. ఆ నాయకుడే మహమ్మద్ షబ్బీర్ అలీ.
ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు షబ్బీర్ అలీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటివరకూ టికెట్ ప్రకటించకపోయినా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటం షబ్బీర్ అలీకి శాపంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ పై బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని అక్కడ బరిలో దించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో కొడంగల్ తో పాటు కామారెడ్డిలోనూ రేవంత్ సమరానికి సై అనబోతున్నారు.
కానీ ఇప్పుడు షబ్బీర్ అలీ పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కామారెడ్డి నుంచి 1989 నుంచి వరుసగా ఏడు సార్లు పోటీ చేసిన షబ్బీర్ అలీ 1989, 2004లో మాత్రమే గెలిచారు. 2010లో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసినా అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి చేతిలో ఓడారు. ఓ వైపు వరుసగా ఓటములు ఎదురవుతున్నా.. నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నాలను షబ్బీర్ అలీ కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు కామారెడ్డి టికెట్ వదులుకోవాల్సి వచ్చింది. ఈ సారి ఆయన్ని నిజామాబాద్ ఆర్బన్ నుంచి పోటీ చేయించేందుకు హైకమాండ్ నిర్ణయించిందని టాక్. కానీ తనది కానీ నియోజకవర్గంలో షబ్బీర్ అలీ గెలుస్తారా? అన్నది చూడాలి. పైగా నిజామాబాద్ అర్బన్ టికెట్ షబ్బీర్ అలీకి ఇస్తే ఈ సీటు ఆశిస్తున్న సంజయ్ తిరుగుబావుటా ఎగరేసే అవకాశముంది. మరి ఈ పరిస్థితుల్లో షబ్బీర్ రాజకీయ జీవితం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on November 6, 2023 7:31 am
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. తన తొలి భార్యతో వేరు పడి దివ్వెల మాధురితో…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో చేసిన సుదీర్ఘ ప్రసంగం సింగిల్ సెకండ్ కూడా…
నిజమే… ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన అవడానికి కొత్త పార్టీనే అయినా… దేశంలోని అన్ని రాజకీయ…
నియోజకవర్గాల పునర్విభజన అంశం.. దేశవ్యాప్తంగా చర్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తమిళ నాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అప్పుడెప్పుడో తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తొలి సారి…
టాలీవుడ్ లో విలన్ల కొరత వాస్తవం. ఎంత బాలీవుడ్ నుంచి కొందరిని తీసుకొచ్చినా నేటివిటీ సమస్య వల్ల ఒరిజినాలిటి రావడం…