Political News

వివేక్ పై పేలుతున్న సెటైర్లు

తెలంగాణాలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి పై నెటిజన్లు విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ లో మొదలుపెట్టి చివరకు కాంగ్రెస్ లోనే చేరారని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. ఒకసారి గెలుపు..ఆరుసార్లు పార్టీ మార్పంటు ఎగతాళి చేస్తున్నారు. పార్టీలు మారటంలో వివేక్ ట్రాక్ రికార్డు చాలా ఘనంగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడైనా కాంగ్రెస్ లోనే స్ధిరంగా ఉంటారా లేకపోతే మళ్ళీ మారిపోతారా అని అడుగుతున్నారు.

వివేక్ సిక్స్ టైమ్స్ జంప్ అంటు సరదాగా చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. సిక్స్ టైమ్స్ జంప్ అని ఎందుకన్నారంటే వివేక్ కుటుంబానికి వీ సిక్స్ పేరుతో ఒక ఛానల్ ఉండటమే. మాజీ ఎంపీ వివేక్ ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారినట్లు విమర్శలు పెరిగిపోతున్నాయి. ఎన్నికలు వచ్చినపుడల్లా పార్టీలు మారిపోవటం వివేక్ కు అలవాటుగా మారిపోయిందని అంటున్నారు. తరచూ పార్టీలు మారుతు తన తండ్రి కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి పరువు తీస్తున్నారంటు నెటిజన్లు ఫుల్లుగా వాయించేస్తున్నారు.

అప్పుడెప్పుడో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వివేక్ మళ్ళీ గెలిచిందిలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదనుకున్నారు. అందుకనే బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో ఎంపీగా టికెట్ దక్కకపోవటంతో మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. తనకు సరైన గుర్తింపు దక్కటంలేదని అలిగి చివరకు బీజేపీలో చేరారు. తాజాగా బీజేపీలో లాభంలేదని అనుకుని మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వివేక్ కు పార్టీ ముఖ్యంకాదు తన ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్నిసార్లయినా ఎన్నిపార్టీలైనా మారుతారు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా వివేక్ పట్టించుకోరు. ఎందుకంటే వివేక్ కు ప్రత్యేకంగా ఒక కమిట్మెంట్ అన్నది లేదు కాబట్టే. వివేక్ మొదటినుండి పార్టీకి కాకుండా పదవులకు మాత్రమే లాయల్ గా ఉంటున్నారు. అందుకనే ఎలాంటి మొహమాటాలు లేకుండా ఇన్నిసార్లు ఇన్ని పార్టీలు మారగలుగుతున్నారు.

This post was last modified on November 2, 2023 10:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరణ్ భుజాల మీద భారతీయుడి బరువు!

మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…

2 minutes ago

వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు 2.15 కోట్లు

ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…

5 minutes ago

బేబీని టెన్షన్ పెడుతున్న పుష్ప 2?

బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…

60 minutes ago

పోలీస్ స్టేషన్ లో రచ్చ..అంబటిపై కేసు

వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…

1 hour ago

రాహుల్‌తో తోపులాట: బీజేపీ ఎంపీకి గాయం

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…

2 hours ago

శివన్న ఆలస్యం చేస్తే ఆర్సి 16 కూడా లేటే…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…

2 hours ago