Political News

ఏపీ స‌ర్కారుపై పీకే అంత మాట‌నేశాడేంటి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ భ‌లేగా క‌లిసి వ‌చ్చాయి. ఆ క‌లిసి వ‌చ్చిన అంశాల్లో ప్ర‌శాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీం చేసిన క్యాంపైనింగ్ కూడా చాలా కీల‌క‌మే. ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేస్తూ ఆ సంస్థ చేసిన కొన్ని కార్య‌క్ర‌మాలు, న‌డిపిన యాంటీ క్యాంపైనింగ్స్ వైసీపీకి బాగా ప్ల‌స్ అయ్యాయి. రాజ‌కీయాల్లో మునుపెన్న‌డూ చూడ‌ని స్థాయిలో కొన్ని దారుణ‌మైన ప్ర‌చారాలు చేయ‌డం, కుల కుంప‌ట్లు రాజేయ‌డంలో కూడా ఐప్యాక్ టీంది కీల‌క పాత్ర‌గా భావిస్తారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఇందుకోసం పీకే వంద‌ల కోట్లు పుచ్చుకున్నార‌ని ప్ర‌చారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ బిజినెస్ లెక్క‌ల సంగ‌తి ప‌క్క‌న పెడితే జ‌గ‌న్‌కు ఎప్ప‌ట్నుంచో పీకే మిత్రుడిగా ఉంటున్నాడు. ఈ ఎన్నిక‌ల ముందు కూడా వైసీపీ కోసం పీకే టీం ప‌ని చేస్తున్నట్లే చెబుతున్నారు.

ఇలాంటి నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌ర్కారును ఇరుకున పెట్టేలా పీకే ఒక చ‌ర్చా వేదిక‌లో మాట్లాడ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్షేమ ప‌థ‌కాల గురించి పీకే ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడాడు. జ‌నాల‌కు ఉచిత ప‌థ‌కాల రూపంలో డ‌బ్బులు పంచ‌డం బాగానే ఉంటుంద‌ని.. కానీ సంప‌ద సృష్టించి ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేయాల‌ని పీకే అన్నాడు.

అత‌నేమీ ఏపీ పేరు ప్ర‌స్తావించ‌కుండా య‌థాలాపంగా ఏమీ ఈ మాట అనలేదు. ప‌ర్టికుల‌ర్‌గా ఏపీ ప్ర‌స్తావ‌న తెచ్చి అక్క‌డ సంప‌ద సృష్టి జ‌ర‌గ‌కుండా సంక్షేమ ప‌థ‌కాల రూపంలో డ‌బ్బులు పంచుతున్నార‌ని.. దీని వ‌ల్ల ఇబ్బందే అని పీకే వ్యాఖ్యానించాడు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. జ‌గ‌న్ కోసం ప‌ని చేసే మిత్రుడే ఈ మాట అన్నాడంటే.. జ‌గ‌న్ స‌ర్కారు ఎంత త‌ప్పు చేస్తోందో అర్థం చేసుకోవ‌చ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పీకే ఈ మాట అన్నాడంటే ఐప్యాక్ టీం జ‌గ‌న్ పార్టీ, ప్ర‌భుత్వం కోసం ప‌ని చేస్తోందా లేదా అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

This post was last modified on October 29, 2023 10:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య వారధి అవుతా: దిల్ రాజు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి…

41 seconds ago

కొత్త సంవత్సరానికి పాత సినిమాల స్వాగతం!

ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక…

22 minutes ago

టెన్షన్ పడుతున్న తండేల్ అభిమానులు!

తండేల్ విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంత ఆలస్యం తర్వాత పలు డేట్లు మార్చుకుంటూ…

56 minutes ago

ముగిసిన విచారణ..ఇంటికి వెళ్లిపోయిన అల్లు అర్జున్!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన…

2 hours ago

శాలువాలతో డ్రెస్సులు..చింతమనేని ఐడియా అదిరింది

రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు…

3 hours ago

బందిపోట్లే కాదు…బంధాలూ హైలెటయ్యే డాకు

వరస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ కొత్త సినిమా డాకు మహారాజ్ జనవరి 12 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటిదాకా…

3 hours ago