తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సానుకూల పవనాలను ఓట్లుగా మలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను గద్దె దించి కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చూస్తోంది. ఆ దిశగా రాష్ట్రంలో హస్తం పార్టీ సాగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అగ్ర నాయకులను ఓడిస్తే సగం పని పూర్తయినట్లేననే ప్రణాళికతో కాంగ్రెస్ ఉన్నట్లు కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ తో పాటు పార్టీలో కీలక నాయకులు కేటీఆర్, హరీష్ రావుపై కాంగ్రెస్ అభ్యర్థులు పైచేయి సాధించేలాగా ఆ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్టున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో సిద్ధిపేటలో హరీష్ రావుపై పోటీకి హరిక్రిష్ణ ను కాంగ్రెస్ నిలబెట్టింది. మరి తన కంచుకోట అయిన సిద్ధిపేటలో హరీష్ ముందు హరిక్రిష్ణ నిలబడతారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
సిద్ధిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ కు మంచి చరిత్రే ఉంది. అయిదు సార్లు (1957, 1967, 1972, 1978, 1983) ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. కానీ ఒక్కసారి కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత మరో పార్టీకి అవకాశమే లేకుండా పోయింది. 1985 నుంచి 2004 వరకు మొదట టీడీపీ నుంచి ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వరుసగా గెలిచారు. ఇక 2004 ఉప ఎన్నికల నుంచి హరీష్ రావుకు ఇక్కడ తిరుగే లేదు. ఉప ఎన్నికలతో కలుపుకొని వరుసగా ఆరు సార్లు నెగ్గారు. ఇప్పుడు రాష్ట్రంలో సిద్ధిపేట అంటే హరీష్ రావు.. హరీష్ రావు అంటే సిద్ధిపేట గా మారింది. సిద్ధిపేట ప్రజలంతా హరీష్ వెనుకే ఉన్నారనే ధీమా బీఆర్ఎస్ పార్టీది.
అలాంటి సిద్ధిపేటలో హరీష్ ను ఓడిస్తే బీఆర్ఎస్ ను మానసికంగా దెబ్బ కొట్టొచ్చన్నది కాంగ్రెస్ ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే గతంలో పోటీ చేయని యువ నాయకుడు పూజల హరిక్రిష్ణ ను ఇప్పుడు రంగంలోకి దించింది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న హరిక్రిష్ణ స్వస్థలం సిద్ధిపేట. ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగుతున్నారు. 25 ఏళ్లుగా పార్టీతో కొనసాగుతున్న ఆయన 2018లోనే ఇక్కడ టికెట్ ఆశించారు. కానీ అప్పుడు పొత్తుల కారణంగా టికెట్ దక్కలేదు. ఇప్పుడు అవకాశం రావడంతో సత్తాచాటేందుకు ఆయన సిద్ధమయ్యారు. నియోజకవర్గంలో హరిక్రిష్ణకు మంచి పట్టే ఉంది. యూత్ లోనూ మంచి పేరే ఉంది. కానీ హరీష్ రావును కాదని హరిక్రిష్ణకు ఓట్లు వేస్తారా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. మరోవైపు కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో రేవంత్ రెడ్డి బరిలో దిగుతారనే ప్రచారం సాగుతోంది. అలాగే సిరిసిల్లాలో కేటీఆర్ కు చెక్ పెట్టేందుకు బలమైన నేతను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు.
This post was last modified on October 29, 2023 10:34 am
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…