Political News

బీసీలను బ్యాలెన్స్ చేసిన కాంగ్రెస్

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం బీసీలకు పెద్ద పీట వేసినట్లే కనబడుతోంది. ఇప్పటికి ప్రకటించిన 100 సీట్లలో 20 నియోజకవర్గాల్లో బీసీ నేతలకు టికెట్లు దక్కాయి. పెండింగులో ఉన్న మరో 19 నియోజకవర్గాల్లో కూడా ఐదుగురు బీసీ నేతలకు టికెట్లు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అంటే హోలు మొత్తంమీద 25 మంది బీసీలకు టికెట్లు ఇచ్చినట్లవుతుంది. నిజానికి 34 నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలన్నది బీసీ నేతల డిమాండ్.

అయితే బీసీల డిమాండు ప్రకారం 34 సీట్లు కేటాయిస్తే అగ్రవర్ణాల్లోని మిగిలిన కులాల్లో గోల పెరిగిపోతుంది. మొత్తం జనాభాలో బీసీల జనాభా సగం అన్నది వాస్తవమే అయినా టికెట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి దామాషా ప్రకారం కేటాయింపులు సాధ్యంకావని అందరికీ తెలుసు. బీసీ నేతలు 34 టికెట్లు కావాలని డిమాండ్లు చేస్తే పార్టీ 25 టికెట్లు కేటాయిస్తోంది. పైగా కేటాయింపు కూడా సీనియర్లు, ఇతర పార్టీల నుండి చేరిన వాళ్ళ మధ్య బ్యాలెన్స్ చేసుకున్న విషయం అర్ధమవుతోంది.

అందుకనే బీసీ నేతలు, సంఘాల నుండి పెద్దగా ప్రతిఘటన, ఆందోళనలు ఎదురుకావటంలేదు. అధిష్టానం నిర్ణయంపై బీసీ నేతల్లో కూడా చాలామంది హ్యాపీగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. బీఆర్ఎస్ అయితే బీసీలకు కేటాయించిన సీట్లు 22 మాత్రమే. అంటే బీఆర్ఎస్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ అదనంగా మూడు సీట్లను కేటాయించినట్లే అని స్పష్టమవుతోంది. కమ్మలు, బ్రాహ్మణ సామాజికవర్గాలకు కూడా బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ లో ఎక్కువ సీట్లే దక్కినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ లో టికెట్ల కేటాయింపులో అంతా కేసీయార్ ఇష్టప్రకారమే ఏకపక్షంగా సాగిన విషయం అందరికీ తెలిసిందే. అసంతృప్త నేతలు తమ గోడు చెప్పుకోవడానికి కూడా కేసీయార్ ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఇదే కాంగ్రెస్ విషయానికి వస్తే రోజుల తరబడి సీనియర్ నేతలను దగ్గర కూర్చోబెట్టుకుని అధిష్టానంలోని కీలక నేతలు చర్చలు జరిపి టికెట్లను ఫైనల్ చేశారు. ఏ రకంగా చూసినా కాంగ్రెస్ లోనే ప్రజాస్వామ్య పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు అర్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక వరకు ఓకేనే మరి ప్రచారం, ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సిందే.

This post was last modified on October 28, 2023 4:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

2 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

3 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

3 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

4 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

4 hours ago