తమ్ముడు.. తమ్ముడే, రాజకీయం.. రాజకీయమే అన్నట్టుగా ఉంది రాజస్థాన్ పరిస్థితి. దేశంలోని ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని కొన్ని చోట్ల చిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్నదమ్ములు ఇద్దరూ ఒకే స్థానం నుంచి బరిలో నిలవడం.. బాబాయి.. అబ్బాయి కలిసి ఒకే సీటు నుంచి అదృష్టం పరీక్షించుకోవడం వంటివి మనకు తెలిసిందే.
అదేవిధంగా మన ఏపీలోనూ 2019 ఎన్నికల్లో తండ్రీ కూతురు(కిశోర్ చంద్రదేవ్, ఆయన కుమార్తె) ఒకే నియోజకవర్గం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి వార్తల్లోకి ఎక్కారు. ఇక, ఇప్పుడు రాజస్థాన్‌లో మరో అడుగు ముందుకు వేశారు భార్యాభర్తలు. ఇక్కడి రామ్‌గడ్ అసెంబ్లీ స్థానానికి చెందిన వీరేంద్ర సింగ్, రీటా చౌధురిలు భార్యాభర్తలు. వీరిద్దరూ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఉన్నతస్థాయి ఫ్యామిలీలు.
ఇక, రాజకీయాల్లోనూ ఈ భార్యాభర్తలు ఒకే పార్టీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ కీలక నాయకులుగా జిల్లాలోను, రాష్ట్రంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న అసెంబ్లీ పోరులో భార్యా భర్తలు ఇద్దరూ టికెట్లు ఆశించారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం వీరేంద్ర సింగ్‌కు మాత్రమే రామ్‌గడ్ అసెంబ్లీ సీటును కేటాయించింది. రీటా చౌధురికి టికెట్ ఇవ్వలేదు.
దీంతో అలిగిన రీటా.. వెంటనే స్థానికంగా కీలక పార్టీ అయిన జన నాయక్ జనతా పార్టీ(జేజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే ఆమెకు రామ్‌గడ్ నియోజకవర్గాన్ని ఈ పార్టీ ఇచ్చేసింది. ఇంకేముంది.. విజయ దశమి సందర్భంగా.. అటు భర్త, ఇటు భార్య.. ఒకేసారి నామినేషన్లు దాఖలు చేశారు. ఒకరు కాంగ్రెస్ తరఫున, ఒకరు జేజేపీ తరఫున ఒకే స్థానం నుంచి పోటీ పడుతుండడం సంచలనంగా మారింది.
ఈ సందర్భంగా భార్యా భర్తలు వేర్వేరుగా ప్రెస్‌తో మాట్లాడుతూ.. ఒకరిపై ఒకరు తొలిసారి విమర్శలు గుప్పించుకున్నారు. నేను హోం మేకర్. మహిళలు పడే కష్టాలు నాకు తెలుసు. వారికి అండగా ఉంటా. అదేవిధంగా ఇతర సమస్యలు కూడా తీరుస్తా. మా ఆయన పక్కా తాగుబోతు. కుటుంబ భారం అంతా నేనే మోస్తా. ఈ విషయం గ్రహించి మహిళలు నాకే ఓటేయాలి– అని రీటా చౌధరి వ్యాఖ్యానించారు.
ఇక, వీరేంద్రసింగ్ కూడా ఇదే తరహాలో మాట్లాడారు. 'ఔను.. నిజమే మా ఆవిడ హొం మేకరే. కానీ బద్ధకిస్టు. మొగుడికి అన్నం పెట్టి .. మంచి నీళ్లు నువ్వే తెచ్చుకునే అనే టైపు.' ఆవిడకు ఓట్లేస్తే.. ఇక్కడి ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవు. నేను ఇక్కడ ప్రజలకు అన్నయ్య, తమ్ముడి లాంటోడిని. సో.. నాకే ఓటేయాలి అని సింగ్ అన్నారు. మొత్తానికి ఈ నియోజకవర్గం రాజకీయం ఇప్పుడు దేశంలోనే సంచలనంగా మారింది.
This post was last modified on October 25, 2023 11:51 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…