Political News

కేసీఆర్ పై పోటీ.. ఈటలకు బీఆర్ఎస్ నాయకుల సపోర్ట్!

తెలంగాణలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్ కు పార్టీలోని అసంత్రుప్త నాయకుల నుంచి తలనొప్పి తప్పడం లేదనే చెప్పాలి. ఈ అసంత్రుప్త నాయకులను బుజ్జగించేందుకు కేటీఆర్, హరీష్ రావు.. ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగినా కొంతమంది నేతలు మాత్రం వినడం లేదని తెలిసింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ రెబల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కోసం పని చేసేందుకూ వెనుకాడడం లేదనే టాక్ వినిపిస్తోంది. తాజాగా గజ్వేల్ లో బీఆర్ఎస్ అసంత్రుప్త నేతల వైఖరే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి కోసం పని చేస్తామని ఈ నాయకులు చెప్పడం గమనార్హం.

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానం గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అయితే సొంతగడ్డ అయిన గజ్వేల్ లో కేసీఆర్ కు అసంత్రుప్త సెగ తగులుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ కేసీఆర్ పై బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పోటీ చేస్తే ఆయనకు మద్దతుగా నిలుస్తామని అసంత్రుప్త నేతలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్- ప్రజ్ణాపూర్ బల్దియా మాజీ ఛైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ ఏఎంసీ మాజీ ఛైర్మన్ టేకులపల్లి రాంరెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సింగం సత్తయ్య, మాజీ ఎంపీపీ రాజు, పలువురు సర్పంచులు తదితర నాయకులు కలిసి సమావేశం ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ బీఆర్ఎస్ రెబల్ నాయకులంతా కేసీఆర్ కు వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించుకున్నారు.

గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తే మేలు జరుగుతుందని అనుకున్నామని, కానీ ఇక్కడి నాయకులను తొక్కేశారని అసంత్రుప్త నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా కేసీఆర్ పై పోటీ చేస్తే ఈటల రాజేందర్ కు మద్దతుగా నిలుస్తామని కూడా చెప్పారు. మరోవైపు అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీ చేస్తానని ఈటల చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అసంత్రుప్త నేతల మద్దతు కూడా ఈటలకు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈటల గజ్వేల్ బరిలో దిగుతారా? అన్నది వేచి చూడాలి.

This post was last modified on October 19, 2023 1:49 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

20 mins ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

22 mins ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

1 hour ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

2 hours ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

3 hours ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

5 hours ago