Political News

ధ‌ర్మం నిల‌బ‌డుతుంది.. : చంద్ర‌బాబు అరెస్టుపై న‌రేష్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్టు, జైలుపై తెలుగు సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు చాలా వ‌ర‌కు మౌనంగా ఉన్నారు. ఒక‌రిద్ద‌రు త‌ప్ప ఎవ‌రూ ఈ విష‌యంలో జోక్యం చేసుకోలేదు. ఈ ప‌రిణామాల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. టాలీవుడ్ నుంచి పెద్ద‌గా స్పంద‌న లేదు. ఈ క్ర‌మంలో తాజాగా న‌టుడు న‌రేష్ స్పందించారు. ధ‌ర్మం నిల‌బ‌డుతుంద‌ని, విజ‌యం ద‌క్కుతుంద‌ని ఆయ‌న చంద్ర‌బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే.. తాను ఏపీ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న‌ట్టు చెప్పారు. ఏ రాజ‌కీయ నేత గురించి కూడా తాను ప్ర‌త్యేకంగా ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేద‌ని చెప్పారు.

కానీ, ధ‌ర్మం అనేది ఒక‌టి ఉంటుంద‌ని, అది మొద‌ట్లో కొంత ఒడిదుడుకుల‌కు లోనైన‌ప్ప‌టికీ..అంతిమంగా విజ‌యం సాధిస్తుంద‌ని న‌రేష్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు విష‌యంపై ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు త‌డుము కోకుండా స‌మాధానం చెప్పారు. వ్యక్తిగత దూషణతో లేదా అణచివేత కోసం ఎవరినైనా బంధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరుగుబాటును సూచిస్తుంది అని అన్నారు. ఇది చివ‌ర‌కు తిరుగుబాటుకు దారితీస్తుంద‌ని చెప్పారు.

గతంలో ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందని.. ఆ ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని చాలామంది నాయకులు జైల్లో ఉన్నారని నరేష్ గుర్తుచేశారు. తర్వాత ఏమైందో అందరికీ తెలుసని చెప్పారు. ప‌రోక్షంగా ఆయ‌న వ‌చ్చే ఏపీ ఎన్నిక‌ల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ దేశ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయిందని, ఇప్పుడు ఏపీలోనూ అలాంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లోకి నేత‌ల కుమారులు, కోడ‌ళ్లు, అల్లుళ్లు రావ‌డం ఎంత వ‌ర‌కు స‌రైందో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. అయితే నాయకులు సరిగ్గా పనిచేస్తేనే ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఉంటుంద‌న్నారు. ఇప్పుడున్న రోజుల్లో రాజకీయం అనేది డబ్బుతోనే ముడిపడి ఉందన్నారు. ఈ ముడిని విప్పడం ప్రజల చేతుల్లోనే ఉందని నరేష్ చెప్పారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ గురించి మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు చెందిన పవన్ క‌ళ్యాణ్‌ రాజకీయాల్లోకి రావ‌డం స్వాగ‌తించాల్సిన విష‌య‌మ‌న్నారు. ఆయ‌న చేస్తున్న పోరాటానికి అంద‌రూ అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

This post was last modified on October 18, 2023 10:30 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

8 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

8 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

10 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 hours ago