పాలేరు టికెట్ కోసం పట్టుబట్టిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మధ్య సమోధ్య కుదిరిందా? అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి నేతల మధ్య సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయనే చెప్పాలి. దీంతో పాలేరును వదిలేసుకున్న తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. మరోవైపు పాలేరులో విజయ దుందుభి మోగించేందుకు పొంగులేటి కసరత్తుల్లో మునిగిపోయారని సమాచారం.
బీఆర్ఎస్లో ప్రాధాన్యత దక్కడం లేదని బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మాజీ ఎంపీకి పాలేరుపైనా కన్ను ఉంది. మొదటి నుంచి కూడా పాలేరు నుంచి పోటీ చేస్తానని చెబుతూ వచ్చారు. కానీ బీఆర్ఎస్లో పాలేరు టికెట్ తనకు కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో తుమ్మల పార్టీని వీడారు. పాలేరు టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ లో చేరారు. తుమ్మల, పొంగులేటి ఇద్దరు పాలేరు కోసం పట్టుబట్టడంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. తుమ్మలకు సర్దిచెప్పి ఖమ్మం నుంచి పోటీ చేయించేలా ఒప్పించిందని తెలిసింది.
2009 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున తుమ్మల విజయం సాధించారు. కానీ 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ తరపున మళ్లీ ఖమ్మం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు తుమ్మల, పొంగులేటి టికెట్ల విషయంపై స్పష్టత వచ్చిందనే చెప్పాలి. దీంతో రెండో జాబితాలో వీళ్ల పేర్లు ఉండటం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మొదటి జాబితాలో వీళ్ల పేర్లు ఉండాల్సింది కానీ పాలేరు టికెట్ కోసం పట్టుబట్టడంతో పెండింగ్లో పెట్టారని పేర్కొన్నాయి.
This post was last modified on October 17, 2023 5:10 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…