Political News

టిక్కెట్లు రాని వారికోసం పోరాడ‌తా: కోమ‌టిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు పార్టీ అసెంబ్లీ టికెట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్ర‌క‌టించిన తొలి జాబితాలో కోమ‌టి రెడ్డికి పార్టీ సీటు ప్ర‌క‌టించింది. అయితే.. కొంద‌రు ఆశావ‌హులు, ముఖ్యంగా కీల‌క నేత‌ల వార‌సుల‌కు పార్టీ టికెట్లు ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టిక్కెట్లు రాని వారి త‌ర‌ఫున తాను అధిష్టానం వ‌ద్ద పోరాటం చేస్తాన‌న్నారు.

బీసీల విష‌యంలో బీఆర్ ఎస్ పార్టీ క‌న్నా కాంగ్రెస్ మంచిగానే వ్య‌వ‌హ‌రించిన‌ట్టు కోమ‌టిరెడ్డి చెప్పారు. తాజాగా ప్ర‌క‌టించిన 55 సీట్లలో బీసీలకు 12, జనరల్ 26, మైనారిటీలకు 3 సీట్లు ఉన్నాయని తెలిపారు. బీసీలకు 12 సీట్లు ఇచ్చార‌ని వ‌చ్చే రోజుల్లో మ‌రింత మందికి అవ‌కాశం ద‌క్కుతుంద‌న్నారు. బీఆర్ ఎస్ పార్టీ క‌న్నా బీసీల‌కు కాంగ్రెస్ ఎక్కువ టికెట్లు ఇచ్చింద‌ని తెలిపారు. టికెట్స్ రానివారు నిరాశ చెందవద్దని, అందరి ఉమ్మడి లక్ష్యం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమేనని అన్నారు.

అసంతృప్తుల విష‌యంపై తాను పోరాటం చేస్తాన‌ని, వారికి న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు. టిక్కెట్లు దక్కనివారికి ఇతర పదవులు వస్తాయన్నారు. మ‌లి జాబితాలో కూడా సామాజిక సమీకరణాలకే పెద్ద‌పీట వేయ‌నున్న‌ట్టు చెప్పారు.

అయితే, పొత్తుల‌పైనా కోమటిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వామ‌ప‌క్ష పార్టీల‌తో పొత్తు కారణంగా కాంగ్రెస్‌కు న‌ష్ట‌మేన‌ని చెప్పారు. సీపీఎం నాయ‌కులు మిర్యాలగూడ టికెట్ కోరుతున్నార‌ని, కానీ, ఇది కాంగ్రెస్‌కు కంచుకోట అని చెప్పారు. మునుగోడు సీటు తీసుకోమంటే కొత్తగూడెం కావాలంటున్నారని, ఇది కూడా పార్టీకి ఇబ్బందేన‌న్నారు. రాష్ట్రంలో ఏర్ప‌డేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌న్నారు. 70 సీట్లు ఖాయంగా గెలుచుకుంటామ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

This post was last modified on October 15, 2023 3:59 pm

Share

Recent Posts

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

9 minutes ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

2 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

2 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

2 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

4 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

4 hours ago