రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. డీహైడ్రేషన్ తో పాటు స్కిన్ ఎలర్జీతో చంద్రబాబు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రభుత్వ వైద్యులు జైల్లోనే చికిత్స అందిస్తున్నారు. అయితే, చంద్రబాబుకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆయన తరఫు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు చంద్రబాబుకు ఊరటనిచ్చింది.
చంద్రబాబు సెల్ లో ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీపీ కోర్టు న్యాయమూర్తి సంచలన ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు అనారోగ్య రీత్యా ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ ద్వారా ఈ పిటిషన్ విచారణ చేసిన కోర్టు అత్యవసరంగా ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చంద్రబాబుకు వైద్యులు ఇచ్చిన నివేదికను న్యాయమూర్తికి చంద్రబాబు తరఫు లాయర్లు వివరించారు. చంద్రబాబుకు చల్లని వాతావరణ పరిస్థితులు కల్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని కోరారు.
అంతకుముందు, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు అనారోగ్యంపై డీఐజీ రవి కిరణ్ ను లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలున్నాయని వైద్యులు చెబుతున్నారని, కానీ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా డీఐజీ ప్రకటనలు ఇవ్వడం ఏమిటని లోకేష్ మండిపడ్డారు. వైద్యులు చెప్పిన 48 గంటల తర్వాత కూడా వారి సూచనలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి డీ హైడ్రేషన్ బారిన పడ్డారని, చల్లని వాతావరణం కల్పించాలని వైద్యులు సూచించినా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని మండిపడ్డారు. అయితే, తన ప్రశ్నలకు డీఐజీ సమాధానమివ్వకుండా దురుసుగా వ్యవహరించారని లోకేష్ ఆరోపించారు.
This post was last modified on October 14, 2023 11:01 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…