తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంరంభం ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఇంతలోనే సెంటిమెంటు రాజకీయాలు ప్రారంభమైపోయాయి. తాజాగా బీఆర్ ఎస్ నాయకుడు, మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్నిఏపీలో కలిపేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కటేనని, ఈ రెండు పార్టీలకు ఓటేస్తే.. తెలంగాణను ఏపీలో కలిపేయడం ఖాయమని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. “ఆంధ్రోళ్లు.. కాంగ్రెస్, బీజేపీ ముసుగులో వస్తున్నారు. ఎన్నికల్లో వారిని ఆదరిస్తే.. ఓటేస్తే.. మన పని ఖతం. ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతే ఢిల్లీ పెద్దలతో ఆ పార్టీ నేతలు మాట్లాడి తెలంగాణను ఏపీలో కలిపేసే కుట్ర చేస్తున్నారు. ఇది మన భవిష్యత్ తరానికి ఇబ్బందికరం” అని మంత్రి అన్నారు.
వాస్తవానికి తెలంగాణలో జరిగిన 2018 ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంటును బీఆర్ ఎస్ నాయకులు ప్లే చేశారు. అప్పట్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును బూచిగా చూపించారు. “మనమీద మళ్లీ ఆంధ్రోళ్లు పెత్తనం చేసేందుకు వస్తున్నరు. ఆంధ్రోళ్ల పెత్తనం మనకు అవసరమా?” అంటూ స్వయం సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించి సెంటిమెంటును రాజేశారు. ఇక, ఇప్పుడు మంత్రి గంగుల కమలాకర్ రూపంలో సెంటిమెంటు రాజకీయాలకు శ్రీకారం చుట్టినట్టయింది. రానున్న రోజుల్లో ఈ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on October 13, 2023 2:09 pm
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…