ఈ ఏడాది విజయదశమి నుంచి విశాఖ నుంచి పరిపాలన చేస్తాను అని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దసరా నాటికి సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలను సిద్ధం చేసేందుకు అధికారులు ఆఘమేఘాలపై పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ భీమిలి బీచ్ మధ్య ప్రాంతంలో పలు కార్యాలయాలకు సంబంధించిన బిల్డింగులను వైసిపి నేతలు జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈనెల 20వ తారీకు లోపు సీఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు మిగతా ఆఫీసులు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
దీంతో, ఈనెల 23న సీఎం క్యాంప్ ఆఫీసును ప్రారంభించేందుకు వైసిపి నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దసరాకు ఒకరోజు ముందే జగన్ ను క్యాంప్ ఆఫీసులో కూర్చోబెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 23వ తేదీన సీఎం జగన్ విశాఖలో గృహప్రవేశం చేసే అవకాశం ఉందని, అందుకు వైసిపి నేత, మాజీ మంత్రి కన్నబాబు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. ఋషికొండపై ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కాంప్లెక్స్ లోనే సీఎం జగన్ ఇల్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
జగన్ తో పాటు అనుబంధ శాఖల అధికారులు కూడా ఇక్కడి నుంచి బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీ కన్నబాబు ఆధ్వర్యంలో పనులన్నీ వేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 15 నాటికి సీఎం క్యాంపు కార్యాలయాన్ని భద్రతా సిబ్బందికి అప్పగించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నిర్మాణాలను చేపట్టిన డిఇసి సంస్థ ఈనెల 20 నాటికి సీఎం క్యాంపు కార్యాలయాన్ని రెడీ చేసి ఇస్తానని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 23న ముహూర్తం బాగుండటంతో అదే రోజు జగన్ గృహప్రవేశం చేస్తే బాగుంటుందని కన్నబాబు సహా పలువురు వైసిపి నేతలు అభిప్రాయపడుతున్నారట.
ఈ నెల 24 నుంచి విశాఖ నుంచి పాలన కూడా సాగించవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే విశాఖలో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమై భద్రతాపరమైన ఏర్పాట్లు, బందోబస్తు వంటి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈనెల 23న గృహప్రవేశం చేసే అంశంపై జగన్ స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. విశాఖలో ఏర్పాట్లన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటించాలని జగన్ ఆలోచనా ధోరణి ఉన్నట్టు తెలుస్తుంది.
సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు అనుబంధ కార్యాలయాల కోసం భీమిలి బీచ్ రోడ్డులో దాదాపు 50 ఇళ్లను అద్దెకు తీసుకొని విశాఖ కలెక్టర్ తో పాటు విశాఖ నగర మున్సిపల్ కమిషనర్ ఆ ఇళ్ల ఆధునీకరణ పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది.
This post was last modified on October 12, 2023 10:07 pm
దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…