Political News

బాబు ఎఫెక్ట్‌: బీజేపీ చేతులు క‌డుక్కున్న‌ట్టేనా?!

ఏపీలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు… కేంద్రాన్ని తాకిన విష‌యం తెలిసిందే. 14 ఏళ్ల పాటు ఉమ్మ‌డి, విభ‌జిత ఏపీని పాలించిన చంద్ర‌బాబును ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌లో రూ.341 కోట్ల అవినీతి జ‌రిగిందంటూ ఆయ‌న‌ను అరెస్టు చేసి.. రాజ‌మండ్రి జైల్లో పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. చంద్ర‌బాబు వంటి నాయ‌కుడిని అరెస్టు చేయ‌డం, ఏకంగా జైల్లో పెట్ట‌డం వంటివి.. సంచ‌ల‌నం సృష్టించాయి.

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారు త‌నంత‌ట తానుగా ఈ సాహ‌సం చేయ‌లేద‌ని, చంద్ర‌బాబును అరెస్టు చేసి చేజేతులా.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను కొని తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేయ‌ద‌ని ఓ వ‌ర్గం నాయ‌కులు విశ్లేషించారు. అంతేకాదు.. అస‌లు త‌మ‌కు ఈ కేసుతోసంబంధం లేద‌ని, కేంద్రంలోని ఈడీ, సీబీఐలే విచారించాయ‌ని బుధ‌వారం మ‌ధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి సైతం చెప్పుకొచ్చారు. దీనికి ముందు ప‌లువురు మంత్రులు గ‌త రెండు మూడు వారాలుగా చంద్ర‌బాబు అరెస్టు వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లే ఉన్నారంటూ.. ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు గుప్పించారు.

ఇదిలావుంటే.. వైసీపీ నాయ‌కులు.. ఓ వ‌ర్గం మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌పై ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రి గ‌తంలోనే స్పందించారు. కేంద్రంలోని బీజేపీ నాయ‌కుల‌కు, మంత్రుల‌కు, ప్ర‌భుత్వానికి సంబంధం ఉంద‌నే విష‌యం స‌రికాద‌న్నారు. ఇక‌, ఇదే అభిప్రాయాన్ని టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ కూడా ఢిల్లీలో చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు అరెస్టు, జైలు వెనుక కేంద్రం ఉంద‌ని తమ‌కు ఎలాంటి స‌మాచారం లేద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ నాయ‌కులు మాత్రం ఈ ప్ర‌చారానికి ఎక్క‌డా ఫుల్ స్టాప్ పెట్ట‌లేదు.

ఇదిలాసాగుతుండ‌గానే తాజాగా బుధ‌వారం రాత్రి ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన ప‌రిణామంతో చంద్ర‌బాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్ద‌లు లేర‌నే విష‌యం స్ప‌ష్టమైంద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నాయ‌కుడు అమిత్ షా.. స్వ‌యంగా నారా లోకేష్ తో భేటీ కావ‌డం, చంద్ర‌బాబు అరెస్టుపై విచారం వ్య‌క్తం చేయ‌డం, 73 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న‌ను ఇలా ఇబ్బందుల‌కు గురి చేయ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించ‌డం వంటివి.. ఈ కేసులో బీజేపీ పాత్ర లేద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని వారు చెబుతున్నారు. మొత్తానికి ఇప్ప‌టికైతే.. చంద్ర‌బాబు కేసు విష‌యంలో బీజేపీ పెద్ద‌ల జోక్యం లేద‌నే విష‌యంపై ఒకింత స్ప‌ష్టత వ‌చ్చింద‌ని అంటున్నారు. మ‌రిమున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

అయితే… ఇదంతా కేంద్ర పెద్దల నాటకమని… ఎట్టి పరిస్థితుల్లోను బీజేపీకి తెలియకుండా చేసి ఉంటే ఈపాటికి బాబు విడుదలై ఉండేవారని అనేవాళ్లు కూడా లేకపోలేదు.

This post was last modified on October 12, 2023 1:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

4 hours ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

4 hours ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

5 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

7 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

7 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

7 hours ago