తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ విజయం దక్కించుకుని తీరాలని హ్యాట్రిక్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న అధికార పార్టీ బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. తనదైన శైలిలో నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకమునుపే.. ఆయన అభ్యర్థులను ఖరారు చేయడంతోపాటు అసంతృప్త నేతలను కూడా బుజ్జగించారు. ఇక, పలు జిల్లాల్లో సిట్టింగులకే సీట్లు కేటాయించారు. ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ వంటి కీలకమైన జిల్లాల్లో సిట్టింగులకు ప్రాధాన్యం ఇచ్చారు.
కుల, వర్గ ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు ఇబ్బంది గా మారిందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని సిట్టింగు ఎమ్మెల్యేల పనితీరు, వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ, ఓటు రేటింగ్ వంటి కీలక అంశాలపై రెండు మూడు దఫాలుగా సర్వేలు చేయించి.. సమా చారం సేకరించారు. అనంతరమే వారికి టికెట్లు కేటాయించారు. అయితే.. ఇప్పుడు మరోసారి చేయించిన అంతర్గత సర్వేల్లో కొందరు సిట్టింగులు వెనుకబడుతున్నారని సమాచారం.
ప్రధానంగా గత ఐదేళ్లలో వారు స్థానికంగా ప్రజలకు ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చకపోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. సీఎంకే సర్వేల ద్వారా సమాచారం చేరింది. దీంతో ఇప్పుడు ఆయా నియోజకవర్గా ల్లో మార్పులు చేయలేక.. వారిని గెలిపించే వ్యూహాలపై సీఎం దృష్టి పెట్టినట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబు తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న ఎమ్మెల్యే జాబితాను తన చేతిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్.. ఎన్నికలకు ముందు ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
అదేసమయంలో ఎమ్మెల్యేలు స్థానికంగా ఇచ్చిన హామీలు, వాటిలో నెరవేర్చని వాటిని కూడా వారి నుంచే సమాచారం సేకరించి.. ఆయా హామీలపై స్థానికుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించే ప్రయత్నం కేసీఆర్ చేయనున్నట్టు సమాచారం. మొత్తంగా.. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు.. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై పూర్తిస్థాయి భారం మోపినప్పటికీ.. మరికొంత మాత్రం తానే భరించి.. హ్యాట్రిక్ మిస్ కాకూడదనే నిర్ణయంలో సీఎం ఉన్నట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on October 12, 2023 11:31 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…