తెలంగాణ శాసన సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలకు మరో 50 రోజుల గడువు మాత్రమే ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ లో నిర్వహించిన బీజేపీ జన గర్జన సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై అమిత్ షా విమర్శలతో విరుచుకుపడ్డారు. “చంద్రశేఖర్ రావూ జీ” అంటూ షా చురకలంటించారు.
కేసీఆర్ గత పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తూ, రాష్ట్రంలోని దళితులు, గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ పేదల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఆదివాసీలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, గిరిజనులకు హామీలు గుప్పించిన కేటీఆర్ ఒక్కటైనా అమలు చేశారా? అని నిలదీశారు. కొందరికి దళితబంధు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని, దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైంది చంద్రశేఖర్ రావూ జీ? అని చురకలంటించారు.
అవినీతిలో, రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా కేసీఆర్ చేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చే సమయం ఆసన్నమైందని, డిసెంబరు 3న హైదరాబాదులో బీజేపీ జెండా రెపరెపలాడాలని బీజేపీ శ్రేణులకు షా పిలుపునిచ్చారు.
మరోవైపు కేసీఆర్ పై బండి సంజయ్ సెటైర్లు వేశారు. కేసీఆర్ తనకు గురువు అని, కేసీఆర్ ను చూసే తాను మాటలు నేర్చుకున్నానని ఆయన అన్నారు. కేసీఆర్ ఆరోగ్య సమాచారం వెల్లడించాలని, ఆయనను ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కనిపించకపోవడంతో తనకు చాలా బాధగా, కేటీఆర్ పై అనుమానంగా ఉందని, ఆయనకు భద్రతను కల్పించాలని కోరారు.
This post was last modified on October 10, 2023 9:48 pm
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…