Political News

కేసీఆర్ ఆరోగ్యం కేటీఆర్ కు పట్టదన్న డీకే అరుణ

సీఎం కేసీఆర్ ఆరోగ్యం పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన కామెంట్లు చేశారు. కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని వార్తలు వస్తున్నాయని, అవి అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయని అరుణ చెప్పారు. కేసీఆర్ ను ఒక్కసారన్నా చూపించాలని ఇటీవల బండి సంజయ్ కూడా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలకు తగ్గట్టుగానే కొద్ది రోజులుగా కేసీఆర్ కూడా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆరోగ్యంపై అరుణ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం కావాలని ఆశతో కేసీఆర్ ను నిర్లక్ష్యం చేయొద్దు అంటూ కేటీఆర్ కు అరుణ హితవు పలికారు. కేసీఆర్ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందకుండా సీఎం కావాలన్న తపన కేటీఆర్ లో కనిపిస్తుందని విమర్శించారు. పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేస్తూ బావబామ్మర్దులు కేటీఆర్, హరీష్ రావులు బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. పెద్దాయనను ఫామ్ హౌస్ లో పడుకోబెట్టి వీరిద్దరూ పరుగులు పెడుతున్నారని ఆరోపించారు. ఇక, కేసీఆర్ కు సన్నిహితుడైన ఎంపీ సంతోష్ కుమార్ ని కూడా దూరం పెడుతున్నారని ఆరోపించారు.

మరోవైపు, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుల సమక్షంలో చికోటి ప్రవీణ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరుణాలలో తప్పిపోయిన పిల్లవాడు తల్లి చెంతకు చేరినట్టుగా బిజెపిలో చేరగానే తనకనిపిస్తోందని ప్రవీణ్ అన్నారు. కొద్దిరోజుల కిందటే బిజెపిలో చేరాల్సి ఉందని, సమాచారం లోపం వల్ల కొంత వాయిదా పడిందని అన్నారు. బిజెపిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, రాబోయే ఎన్నికల్లో బిజెపిదే అధికారం అని అన్నారు.

కాగా, కేసినో వ్యవహారాల నేపథ్యంలో చికోటి ప్రవీణ్ పేరు ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, చికోటి ప్రవీణ్ బిజెపిలో చేరబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కొద్దిరోజుల క్రితం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ, చివరి నిమిషంలో బిజెపి హై కమాండ్ బ్రేక్ వేయడంతో ప్రవీణ్ బిజెపి తీర్థం పుచ్చుకునే కార్యక్రమం పెండింగ్లో పడిందని ప్రచారం జరిగింది. తాజాగా, చికోటి ప్రవీణ్ చేరికకు బిజెపి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈరోజు చికోటి ప్రవీణ్ బిజెపి కండువా కప్పుకున్నారు.

This post was last modified on October 7, 2023 10:00 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago