Political News

రేవంత్ రెడ్డి కాదు..రేటెంత రెడ్డి: కేటీఆర్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓటుకు నోటు ఇప్పుడేమో సీటుకోరేటు అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయనను రేవంత్ రెడ్డి అనడం లేదని రేటెంత రెడ్డి అంటున్నారని కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నట్టుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని. కాంగ్రెస్ పార్టీకి అలాంటి దుస్థితి వచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీలో పైసలు ఉన్నోళ్లకే టికెట్లు ఇస్తున్నారని లొల్లి జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికలైనా మరునాడు గెలిచిన పదో పన్నెండో ఎమ్మెల్యేలతో ఇదే రేవంత్ రెడ్డి బిజెపిలో చేరకపోతే తనను నిలదీయాలని, ఈ విషయం రాసి పెట్టుకోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ మనిషి అని, 1999లో కార్వాన్ లో పోటీ చేసిన కిషన్ రెడ్డికి ఏజెంట్ గా రేవంత్ రెడ్డి ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు.

ఆనాటి నుంచి ఈనాటి వరకు బిజెపితో తెరచాటు చీకటి వ్యాపారాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని, ఆ గాడ్సేను గాంధీభవన్లో కూర్చోబెట్టింది ఆర్ఎస్ఎస్, బిజెపి నేతలేనని, మైనార్టీలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని అన్నారు. ఏ పార్టీకి బీ టీమ్ అవ్వాల్సిన అవసరం బీఆర్ఎస్ కు లేదని, తమది ప్రజల టీం అని కేటీఆర్ చెప్పారు. 23 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నామని, తెలంగాణలో ప్రజల ఏ టీం బీఆర్ఎస్ అని చెప్పారు. కేంద్రంలో తమ పాత్ర లేనిదే ప్రభుత్వాలు ఏర్పడని పరిస్థితిని తీసుకొస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

This post was last modified on October 7, 2023 9:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago