ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో మరో తెలంగాణ మంత్రి గొంతు ఎత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుడనే ముద్ర ఉన్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా ఈ విషయంలో రియాక్టయ్యారు. చంద్రబాబు అరెస్ట్ చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదని తలసాని అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నేతగా ఉన్నప్పుడు మరియు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తలసాని తెలిపారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశానని పేర్కొంటూ బాబు అరెస్టు వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసిందని తలసాని అభిప్రాయపడ్డారు. అధికారం శాశ్వతం కాదు అని హితవు పలికి తలసాని ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబు పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరమని అసహనం వ్యక్తం చేశారు.
కాగా, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావు తో పాటుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్టు పట్ల విచారం వ్యక్తం చేశారు.
This post was last modified on October 4, 2023 5:43 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…