టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి వర్సెస్ మంత్రి ఆర్కే రోజా విషయంలో తలెత్తిన వివాదంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వేలు పెట్టిన విషయం తెలిసిందే. బండారు సత్యనారాయణ మూర్తి నోరు పారేసుకున్నారని, ఒక మహిళ గురించి ఎవరైనా బయటి వ్యక్తులు ఇలా మాట్లాడతారా? అంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. అయితే, మహిళల గురించి ఆర్జీవీ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
“మహిళల ఆత్మ గౌరవం గురించి వర్మ చెపితేనే వినాలి” అంటూ కొందరు నెటిజన్లు స్పందించారు. మరికొందరు.. వర్మ గురివింద నీతులు చెబుతున్నాడంటూ కామెంట్లు చేశారు. మంత్రి రోజా నోరు పారేసుకున్నప్పుడు వర్మ ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. అధికారంలో తమ పార్టీ వుంది కదా, ప్రతిపక్ష పార్టీ ఎవరన్నా ఏదన్నా అంటే కేసులు పెట్టడమే పనిగా చేస్తున్న అధికార పార్టీవాళ్లకి, ఆర్జీవీకి సదరు మంత్రిగారు మాట్లాడిన బాష, ఒకా మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా అతన్ని ఎంత నీచంగా మాట్లాడారో వినపడలేదా అని కొందరు ప్రశ్నించారు.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి వైసీపీ నాయకులు అత్యంత ఘోరంగా, అగౌరవంగా మాట్లాడినప్పుడు ఆర్జీవీ కి వినిపించలేదా? అప్పుడు మహిళా కమిషన్ గుర్తుకు రాలేదా అని మరికొందరు అడిగారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ గతంలో ఒక యువతి కాళ్ళు నాకడం, చేతులు నాకటం, ఇంకా స్త్రీ యొక్క అవయవాల గురించి మాట్లాడటం వంటి పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేయడం గమనార్హం. ఈ పరిణామాలను గమనించిన వారు ఆర్జీవీ అడ్డంగా బుక్కయ్యాడే అని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on September 30, 2023 7:32 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…