స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు, అంగళ్లు అల్లర్ల కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత 18 రోజులుగా చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు బెయిల్ కస్టడీ, ముందస్తు బెయిల్ లపై ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగానే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, టిడిపి అగ్రనేత నారా లోకేష్ కూడా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అరెస్టు కాబోతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారానికి తగ్గట్టుగా తాజాగా ఆ కేసులో లోకేష్ ను ఏ14 గా సిఐడి పేర్కొనడం సంచలనం రేపింది. తాజాగా ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన మెమోలో లోకేష్ ను నిందితుడిగా సిఐడి చేర్చడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి పొంగూరు నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని రాజశేఖర్ తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో సీఐడీ చేర్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, జగన్ పై లోకేష్ విమర్శలు గుప్పించారు. జనం రోడ్డు ఎక్కితే జగన్ జడుసుకుంటున్నారని, నిరసనలు అంటేనే ఉలిక్కిపడుతున్నాడని ఎద్దేవా చేశారు.
నిరసనలపై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని, ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందని ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన అంగన్వాడీలను నిర్భంధించడం దుర్మార్గమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల సాధన కోసం విజయవాడలో ధర్నాకు దిగిన అంగన్వాడీలను ధర్నా చౌక్ కు వెళ్లకుండా పోలీసులు ఈడ్చుకొని మరి అరెస్టు చేసిన వైనం సంచలనం రేపింది. ఆ వ్యవహారంపైనే లోకేష్ స్పందించారు.
This post was last modified on September 26, 2023 5:06 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…