రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ కిందామీదా పడుతోంది. దాదాపు 80 స్థానాల్లో అభ్యర్థులను సులువుగానే ఖరారు చేసేలా కనిపిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానానికి మిగిలిన స్థానాల్లో ఇబ్బందులు తప్పడం లేదని తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉండటమే అందుకు కారణం. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం కూడా ఉంది. కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మధ్య పోటీ నెలకొంది.
మొదటి నుంచి కూడా పాలేరు నియోజకవర్గం ఆసక్తి కలిగిస్తూనే ఉంది. ఇక్కడి నుంచి ఏ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారన్నది సందిగ్ధంగానే మారింది. అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే మరోసారి కేసీఆర్ పాలేరు టికెట్ కేటాయించారు. దీంతో అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరిపోయారు. అంతకుముందే బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకుని పొంగులేటి కూడా హస్తం గూటికే చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధమైన షర్మిల.. పాలేరు టికెట్ అడిగారనే వార్తలూ వచ్చాయి.
ఇప్పుడు పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు నిలబడతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అయినప్పటికీ పాలేరులో కాంగ్రెస్ క్యాడర్ యాక్టివ్ గానే ఉంది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయడం కోసం పొంగులేటి, తుమ్మల పట్టు బడుతున్నారు. పొంగులేటి ఎప్పటి నుంచో పాలేరుపై కన్నేశారు. కాంగ్రెస్ లో చేరే ముందు కూడా పాలేరు టికెట్ కోసం అధిష్ఠానంతో పొంగులేటి చర్చలు జరిపినట్లు తెలిసింది. మరోవైపు పాలేరు టికెట్ హామీ మేరకే తుమ్మల కాంగ్రెస్లో చేరారని చెబుతున్నారు. అలా కాదని ఖమ్మం నుంచి తుమ్మలను పోటీ చేయమంటే ఆయన ఒప్పుకోవడం లేదని తెలిసింది. మరి వీళ్లిద్దరి టికెట్ పంచాయతీని అధిష్ఠానం ఎలా తీరుస్తుందో చూడాలి.
This post was last modified on September 24, 2023 10:16 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…